ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ రైళ్లన్నీ రద్దు..

నవతెలంగాణ  విజయవాడ: ఈ నెల 28 నుంచి డిసెంబర్‌ 4 వరకూ మూడు రైళ్లు రద్దు కానున్నాయి. వాటిలో రాయగడ – గుంటూరు ఎక్స్‌ప్రెస్‌.. విశాఖ – గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌.. విశాఖ – మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌‌లు రద్దు కానున్నాయి. ఇక నవంబర్‌ 27, 28, 29, డిసెంబర్‌ 1, 2 తేదీల్లో 2 రైళ్లు రద్దు కానున్నాయి. విజయవాడ – విశాఖ రైలు.. విశాఖ – విజయవాడ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దు కానున్నాయి. ఈ నెల 27 నుంచి డిసెంబర్‌ 3 వరకు 2 రైళ్లు రద్దు చేయడం జరిగింది. కాకినాడ – విశాఖ మెమూ స్పెషల్‌ రైలు… విశాఖ – కాకినాడ మెమూ స్పెషల్‌ రైలు రద్దు చేయడం జరిగింది.

Spread the love