క్రికెట్ లో మెరిసిన నల్లగొండ ఆణిముత్యం

  • వన్ డే క్రికెట్ పోటీలకు ఎంపికైన స్రవంతి
  • పట్టుదలే ముఖ్య కారణం అంటున్న స్రవంతి తండ్రి శ్రీనివాస్
  • అండర్ -15 కు ఎంపిక కావడం పట్ల మండల ప్రజలు హర్షం

నవతెలంగాణ -పెద్దవూర:  కృషి, పట్టుదల ఉంటే అన్నీ రంగాల్లో రాణించవచ్చని అందుకు పేదరికం అడ్డు రాదనీ నిరూపించింది నల్లగొండ జిల్లా యువతి బొడ్డుపల్లి స్రవంతి. ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది.  ఏదో రంగంలో రాణించాలని తపన ఉంటుంది. కొందరు విజయం సాధిస్తారు. మరికొందరికి ఆ అవకాశాలు ఉండకపోవచ్చు.  కానీ ఈ చిన్నారి పట్టుదలతో రాణించవచ్చని నిరూపించింది. చిన్నతనంలో క్రికెట్ లో తన ప్రతిభను చాటుతూ.. మరి కొంత మంది కూడా రాణించాలని కలలు కంటుటుంది. పేదింటి విద్యార్థులు ఇంజినీర్లు, డాక్టర్లు కావడం కోసం ఇంటర్మీడియేట్‌ తోపాటు ఐఐటీ, నీట్, ఎంసెట్‌ ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో విద్యార్థులు ఆయా పోటీ పరీక్షల్లో సత్తా చాటుతున్నారు కొందరు, క్రీడారంగంలో మరికొందరు, కళారంగంలో, విద్యారంగంలో కొందరు ప్రతిభ చాటుతారు. కానీ, స్రవంతి తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రానికి చెందిన బొడ్డుపల్లి శ్రీనివాస్, బాలమణి దంపతుల రెండవ కూతురు స్రవంతి. ప్రస్తుతం విజయవాడ లోని,బి షప్ హాజ్రయ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. 5వ తరగతి వరకు పెద్దవూరలోని న్యూకిడ్స్ ఉన్నత పాఠశాలలో చదివిన ఆమె.. 4వతరగతి చదువుతున్నప్పుడే హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో గల షేక్ ఖాజా వద్ద 8 నెలల పాటు క్రికెట్ కోచింగ్ తీసుకున్నది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో విజయవాడలో శిక్షణ తీసుకున్నది. పేద కుటుంబం కావడంతో ఇద్దరు కూతుర్లను చదివించుటకు చాలా తల్లిదండ్రులు చాలా కష్టపాడాల్సి వచ్చింది. ఈ తరుణంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కోచ్ లు స్రవంతిని ఎంపిక చేశారు.110 కిలోమీటర్లు వేగంతో బౌలింగ్ చేయడం వికెట్లు తీయడంతో బౌలింగ్ విభాగంలో ఎంపిక చేశారు. ఇటు బ్యాటింగ్ సైతం బాగా చేయగలదు. గొప్ప ఆల్ రౌండర్ గా ప్రతిభ కనపరస్తూ కోచ్ ల దృష్టిని ఆకర్షించింది. దింతో అండర్ 15 స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ కు స్రవంతి  ఎంపికైంది. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 17 నుండి 27 వరకు వడోదర, బరోడా, డెహ్రాడూన్ లలో జరిగే అండర్-15 క్రికెట్ వన్డే టోర్నమెంట్ లో స్రవంతి తన ప్రతిభ చాటనుంది.  గతం లో జరిగిన అనేక మ్యాచుల్లో ఆమె తన జట్టును విజయ తీరాలకు నడడిపించింది.

110-120 కిలోమీటర్లు వేగంతో బౌలింగ్ చేయగలదు :  శ్రీనివాస్ (తండ్రి)

స్రవంతికి 4వ తరగతిలోనే హైదరాబాద్ లో ఎల్.బీ.నగర్ లో క్రికెట్ కోచింగ్ ఇప్పించాను. గంటకు 110 నుంచి 120 కిలోమీటర్లు వేగంతో బౌలింగ్ చేయగలదు. మంచి ఆల్ రౌండర్ ప్రతిభ కనబర్చుతుంది. అనేకసార్లు జట్టును గెలిపించి విజయాన్ని అందించుటలో ప్రముఖ పాత్ర పోషించింది. ఇండియా జట్టులోకి ఎంపిక అయ్యేలా ఎంత ఖర్చు అయినా దాతల సహకారంతో మా పాపను ఇంకా శిక్షణ ఇప్పిస్తాం.

నా ఎంపికకు అమ్మ నాన్న కృషి పట్టుదలే ముఖ్యం :
స్రవంతి
అండర్ 15 స్టేట్ లెవల్ క్రికెట్ టోర్నమెంట్ కు ఎంపిక కావడంలో మా అమ్మ నాన్న, కోచ్ అందించిన తోడుపాటు, పట్టుదలతోనే సాధ్యమైంది. మాకుటుంబ సభ్యుల సహకారం వల్లనే స్టేట్ క్రికెట్ జట్టుకు నన్ను ఎంపిక చేసింది. ఆల్ రౌండర్ గా, 110 కిలోమీటర్లు వేగంతో బౌలింగ్ చేయగలను. మానాన్న ప్రతి నెల రూ.15వేలు కట్టి ఒక ఏడాది పాటు శిక్షణ ఇప్పించారు. బాగా కష్టపడి ఇండియా టీంలో సెలక్ట్ అయ్యేలా నా ప్రతిభను కనపర్చుకుంటాను. దానికి ఇంకా ఆర్థికవనరులు అవసరం స్వచ్చంద సంస్థలు, దాతలు సహాయం అందించాలని కోరుకుంటున్నాను.

Spread the love