కరీంనగర్‌ కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌లపై ఈసీ బదిలీ వేటు

నవతెలంగాణ హైదరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌పై బదిలీ వేటు పడింది. కలెక్టర్‌ గోపీ, సీపీ సుబ్బరాయుడులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈమేరకు ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కలెక్టర్‌, ఎస్పీలను సాధారణ పరిపాలనాశాఖకు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

Spread the love