తుపాకుతో, తుటాలతో రాబోయే బహుజన రాజ్యాధికారం నీ ఆపలేరు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
బహుజన యుద్ధ వీరుడు భీమ్ ఆర్మీ చీఫ్ & ఆజాద్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షులు అడ్వకేట్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ పైన కాల్పులు జరిపిన మతోన్మాద ఉన్మాదులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలనీ డిమాండ్ చేస్తూ భీమ్ ఆర్మీ స్టూడెంట్స్ ఫెడరేషన్ తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షులు రాజేందర్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ ను గురువారం దగ్ధం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీమ్ ఆర్మీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సురేష్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ పైన దాడి కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వల  వైపల్యo కారణం గానే జరిగిందన్నారు. భీమ్ ఆర్మీ చీఫ్ అడ్వకేట్ చంద్రశేఖర్ కు ఎటువంటి ప్రాణహాని జరిగిన కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.తక్షణమే భీమ్ ఆర్మీ చీఫ్ అడ్వకేట్ చంద్రశేఖర్ అజాద్ కు జేడ్++  కేటగిరి సెక్యూరిటీ నీ కల్పించాలని అయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఎస్ ఎఫ్ ఐ అధ్యక్షులు ప్రసాద్, ఎఎస్ఎ అధ్యక్షులు వెంకటరమణ, ఎంఎస్ఎఫ్ అధ్యక్షులు దినేష్, నరేష్, విశ్వ, రాజేందర్, సిద్ధు, భీమ్ ఆర్మీ స్టూడెంట్స్ ఫెడరేషన్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love