అకాల వర్షం.. రైతుకు నష్టం..!

– గాలిదుమారంతో దెబ్బతిన పంటలు
– నేల రాలిన మామిడి కాయలు
– పరిహారం ఇవ్వాలని రైతుల వేడుకోలు
నవతెలంగాణ-జైపూర్‌
ఆరుగాలం పండించిన పంట చేతుకు వచ్చే క్రమంలో మంగళవారం జిల్లాలో కురిసిన వర్జానికి ఆపార నష్టం మిగిల్చింది. గాలి దుమారంతో పాటు కురిసిన వడగళ్ల వనాకు కోత దశకు వచ్చిన వైరి పైరు నేలమట్టం అయింది. యాసంగిలో సాగు చేసిన పంటలు అతలాకుతలమయ్యాయి. ప్రధానంగా వరి, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిళ్లింది. జైపూర్‌ మండలలోని వివిధ ప్రాంతాల్లో వరి కోతలు పూర్తి కాగా మరి కొన్ని ప్రాంతాల్లో వరి పైరు కోతకు సిద్ధంగా ఉంది. చేతికందుతుందనుకున్న సమయంలో ప్రకృతి వైపరిత్యానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలో 366 మంది రైతులకు సంబంధించి 537 ఎకరాల్లో సాగు చేసిన వరి పంటకు నష్టం జరిగిందని అధికారులుఅంచనా వేస్తున్నారు. అదేవిధంగా భీమారం మండల పరిధిలో 50 మంది రైతులకు సంబంధించి సుమారుగా 90 ఎకరాల్లో సాగు చేసిన వరి పంటకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కిష్టాపూర్‌ నుంచి మొదలు శివ్వారం వరకు కురిసిన రాళ్లవానతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసుకున్న వరి ధాన్యం తడిసిముద్దయ్యింది. అదేవిధంగా ఉమ్మడి జైపూర్‌ మండలంలో మామిడి పంట 35 నుండి 40 శాతం నష్టం జరిగి ఉడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. జైపూర్‌ మండల పరిధిలో 1896 ఎకరాల మామిడి తోటలతో పాటు భీమారం మండల పరిధిలో 2200 ఎకరాల్లో 50 శాతం మామిడి పంట చేతికందినట్లు అధికారులు భావిస్తున్నారు. అకాలవర్షంతో పాటు బలంగా వీచిన గాలులతో వేర్లతో సహా చెట్లు పడిపోగా కొమ్మలు విరిగి చెట్టుకు ఉన్న కాతలో 90 శాతం నేల రాలింది. పంట నష్టపోయిన రైతులు తమకు పంటనష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

రాలిందంతా పగిలింది: శ్రీనివాస్‌గౌడ్‌, రైతు శివ్వారం, జైపూర్‌.
రాళ్లవానతోపాటు గాలిదుమారంతో మామిడి పంట చేతికందకుండా పోయింది. చెట్టుకున్న 90 శాతం కాయ నేల రాలి పగిలి పోయింది. పశుగ్రాసానికి తప్పామార్కెట్‌కు తరలింలే వీలులేకుండా ఉంది. ప్రతి సంవత్సరం కోత దశలో మామిడి పంటను నష్టపోవల్సి వస్తుంది. శివ్వారం, పౌనూర్‌, వేలాల గ్రామ శివారుల మీదుగా రాళ్లతో కూడిన వర్షంతో మామిడి, వరి పంటలను తీవ్రంగా నష్టపోవల్సి వచ్చింది. అధికారులు వెటనే సర్వే చేపట్టి నష్ట పరిహారం ఇచ్చే విదంగా చూడాలి.

సుమారు 40 శాతం మామిడి పంటకు నష్టం: తిరుపతి, ఉధ్యానవ శాఖ అధికారి.
ఉమ్మడి జైపూర్‌ మండలంలో కురిసిన అకాలవర్షంతో సాగులోని మామిడి పంట సుమారు 40 శాతం నష్టం వాటిలి ఉండవచ్చు. దాదాపుగా 50 శాతం మామిడి పంట చేతికందింది. మిగిఇ ఉన్న యాభై శాతంలో అత్యధికంగా పంటకు నష్టం జరిగినట్లు గుర్తించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంటలకు జరిగిన నష్టాన్ని గుర్తించేందకు క్షేత్రస్థాయి నివేధికలు సిద్ధం చేస్తున్నాం.

నష్టం అంచనా వేస్తున్నాం: మార్క్‌గ్లాడ్సన్‌, వ్యవసాయ అధికారి.
మంగళవారం కురిసిన వడగళ్ల వానతో పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నాం. ప్రాథమికంగా సేకరించిన సమాచారాన్ని అధికారులకు నివేధించి ప్రభుత్వ నిర్ణయం మేరకు పూర్తి స్థాయిలో నివేధికలు తయారు చేయనున్నాం. ఆలస్యంగా సాగు చేసిన వరి పంటలకు నష్టం జరిగింది. ఉమ్మడి జైపూర్‌ మండలంలో 650 నుండి 700 ఎకరాల్లో సాగు చేసిన వరి పంటకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యక్తిగతంగా క్షేత్రస్థాయి రిపోర్టు తీసుకోవల్సి ఉంది.

ప్రతి ఏటా ఇదే గోస: సందెల తిరుపతి, రైతు ఆర్కెపల్లి, భీమారం
ప్రతి సంవత్సరం ప్రకృతి ప్రకోపానికి గురి కావల్సి వస్తోంది.. వర్షం పాక్షికంగా కురిసినా గాలి వేటు పంటలను అతలాకుతలం చేసింది. నలువైపుల నుండి బలంగా వీచ్చిన గాలిదుమారంతో ఇటు నుండి అటు నుండి వరి పైరు పడిపోయింది. పైరు కోయాలనుకున్నా హార్‌వేస్టర్‌ పంటికి అందేటట్టు లేదు..మనుషులతో కోపియ్యాలంటే ఖర్చులు అదనంగా భరించాల్సి వస్తుంది…నిలాటు పొలాన్ని గంటలో కోసే హార్‌వేస్టర్‌ పడిపోయిన పొలంలో రెండు గంటలు కోయాల్సి వస్తోంది. గాలివేటుకు పడిపోయిన పంట పొలంలో దిగుబడి శాతం తగ్గడమే కాకుండా హార్‌వేస్టర్‌ చార్జీలు అదనంగా నష్టపోవల్సి వస్తుంది.

Spread the love