సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం ఆగదు..

– కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల రెగ్యులరైజేషన్ కొరకై ఉద్యమం కోనసాగుతుందని,తెలంగాణ రాష్ట్రం లోని 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు 1335 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజేషన్ కొరకై అమలు చేయాలి అని ఉద్యమం చేస్తున్న సమస్యలు పరిష్కారం చూపకుండా మిన్నకుండి పోవడం సుబాబు కాదని తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం అధ్యక్షులు దత్తాహరి అన్నారు. యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారని, ఈ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఈ ఉద్యమం అన్ని యూనివర్సిటీ లలో ఉద్యమిస్తున్నట్లు జాక్ రాష్ట్ర కో కన్వీనర్ డాక్టర్ వి దత్త హరి తెలిపారు. సోమవారం తెలంగాణ యూనివర్సిటీ లోని ఆర్ట్స్ కళాశాల భవనం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల మద్దతుతో ముఖ్యమంత్రిని కలిసి సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు చెప్పారు. దానికో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టడం అన్నారు.  మంగళవారం రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ లకు సమస్యలను పరిష్కరించండి అని విన్నవించుకోవడం కోసం వినూత్నంగా ఉత్తరాలు రాయడం జరుగుతుందని రాష్ట్ర జాక్ పిలుపుమేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ప్రజా ప్రతినిధులు వివిధ హోదాలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులను మా సమస్యను మా బాధను మా గోడును విన్నవించుకోవటం తద్వారా మా సమస్యను వెంటనే పరిష్కారం అయ్యేవరకు ఈ పోరాటం నిరంతరంగా సాగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపిరాజ్, డాక్టర్ శరత్, డాక్టర్ దేవరాజ్ శ్రీనివాస్, డాక్టర్ జలంధర్, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్, డాక్టర్ జోష్ణ, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ జి శ్రీనివాస్, గంగాధర్, సందీప్, ఆనంద్, రాజేశ్వర్ తోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Spread the love