– ఈసీ తీర్మానాలు అమలు చేయాలి..
– యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించాలి…
నవతెలంగాణ – డిచ్ పల్లి
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లో సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన జన్నారపు రాజేశ్వర్ అన్నారు.తెలంగాణ యూనివర్సిటీ పి.డి.ఎస్.యూ కమిటీ సమావేశం యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాలలో గురువారం నిర్వహించి పలు తీర్మానాలను ఆమోదించారు. ఈ సమావేశం ను ఉద్దేశించి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ లో వీసీ లేనందున కాన్వాకేషన్ మైగ్రేషన్, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వటం లేదని, తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి చేసిన తీర్మానాలను వెంటనే అమలు చేయాలని, యూనివర్సిటీ లో నూతన గర్ల్స్ హాస్టల్ వెంటనే నిర్మించాలని, నూతన కోర్సులను ప్రవేశ పెట్టాలని, యూనివర్సిటీ అభివృద్ధి కి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని, యూనివర్సిటీ లో కాంట్రాక్ట్ అధ్యాపకుల ఉద్యమానికి మద్దతు తెలువుతున్నామని, యూనివర్సిటీ లో పూర్తి స్థాయిలో పీజీ సీట్లు భర్తీ చేయాలని,యూనివర్సిటీ లో అకడమిక్ వాతావరణాన్ని నెలకొల్పాలని, యూనివర్సిటీ లో సమస్యల పరిష్కారం కోసం యూనివర్సిటీ కమిటీ నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ యూనివర్సిటీ అధ్యక్ష, కార్యదర్శులు సంతోష్, జయంతి, గౌని ప్రసాద్, అక్షయ్, శివసాయి, ఆకాష్, రాజ్ కుమార్, అశ్విత్, తదితరులు పాల్గొన్నారు.