వైద్యారోగ్య రంగంలో దేశంలోనే సరికొత్త అధ్యాయం..

– గతంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు.. నేడు నేను వస్తా బిడ్డ సర్కారు దవాఖానకి
– బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు ఏర్పాటు
– అన్ని రంగాల్లో మహిళలకు తెలంగాణ సర్కార్ పేద్దపిటా..
– ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
నవతెలంగాణ – డిచ్ పల్లి
వైద్యారోగ్య రంగంలో తెలంగాణ ప్రస్థానం ఒక దేశంలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిందని, గతంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అనే వారిని దానిపై పాటా కుడా ఉందని, కెసిఆర్ అధికారంలో కూర్చున్న తర్వాత నేడు నేను వస్తా బిడ్డ సర్కారు దవాఖానకు అనే నినాదం ప్రతి ఒక్కరి నోటి నుండి వస్తుందని దానికి అనుకూలంగా ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది అహర్నిశలు కృష చేస్తున్నారని, ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు ఏర్పాటు చేసిందని, నేడు అన్ని రంగాల్లో మహిళలకు తెలంగాణ సర్కార్ పేద్దపిటా వేస్తుందని ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవం, వైద్య ఆరోగ్యశాఖ దశాబ్ది ఉత్సవాల ప్రగతి నివేదికను బుధవారం డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఎస్ ఎల్ జీ గార్డెన్ లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. అనంతరం సభను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కెసిఆర్ న్యూట్రిషన్ కిట్, కెసిఆర్ కిట్, ప్రతిభ కనబరిచిన పలువురికి ప్రశంస పత్రాలు, పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ తెలంగాణ రాకుండా ముందు ఎలా ఉండేదని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పుడు ఎలా ఉందని, గతంలో నేను రాను బిడో సర్కారు దవాఖానకి అనే వారని, నేడు నేను వస్తా బిడ్డ సర్కారు దవాఖానకి అనే విధంగా స్థాయికి తీసుకొచ్చాన సీఎం కేసీఆర్ అన్నారు.నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎల్ఐసి లు కోట్ల మేరకు అందజేయడం జరిగిందని, అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఇప్పటివరకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లో 22 కోట్ల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
కరోనా కష్టకాలంలో గ్రామాల్లో ప్రజల ఆరోగ్యాల సేవల కోసం వారి ప్రాణాలు పణంగా పెట్టి ఇంటింటి తిరుగుతూ ఆరోగ్య సేవలను ఆశా కార్యకర్తలు, ఎఎన్ఎం లు, వైద్య సిబ్బంది అందించారని, మీ సేవలు ఎప్పటికీ మరువలేనివని జీవితంలో ఎప్పుడు గుర్తుండి పోతుందన్నారు. నాకు కరోనా వచ్చిన సందర్భంగా నేను భయపడలేదని, ధైర్యంగా ఉండి నేనే డ్రైవింగ్ చేసుకుంటూ హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగిందన్నారు. కరోనా వల్లా చాలామంది భయపడి తమ ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. కానీ మహిళా సోదరులు మాతృమూర్తులు ఆ కరొన సమయంలో అందించిన సేవలు ఎంత చెప్పినా తక్కువే నన్నారు. మహిళా సోదరి మనులకు వైద్య ఆరోగ్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.మహిళల భాగస్వామ్యంతో రాష్ర్టాభివృద్ధి సాధ్యమైందని, అభివృద్ధి సంక్షేమంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నది తెలంగాణ సర్కారేనని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా మహిళలకు గౌరవం ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కేసీఆర్‌ కిట్ల నుంచి న్యూట్రిషన్‌ కిట్ల దాకా.. డయాలసిస్‌ సెంటర్ల నుంచి డయాగ్నొస్టిక్‌ కేంద్రాల దాకా.. ప్రతి ఆలోచన ప్రతిష్టాత్మకమని, ప్రతి నిర్ణయం చారిత్రాత్మకమని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కొనియాడారు. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ ప్రస్థానం దేశంలోనే ఒక సరికొత్త అధ్యాయమని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్‌ మహిళా సంక్షేమానికి ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారఖ్‌ తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అంగన్‌వాడీ టీచర్ల వేతనాలను రూ.4,300 నుంచి రూ.13,650 వరకు, హెల్పర్ల వేతనాలు రూ.2,200 నుంచి రూ.7,850 వరకు, మినీ అంగన్‌వాడీ టీచర్ల వేతనాలు రూ.2,200 నుంచి రూ.7,800 వరకు, ఆశ వర్కర్ల వేతనాలు రూ.1,500 నుంచి రూ.9,750 వరకు పెంచినట్లు తెలిపారు. ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీటితో మహిళలకు నీటి తిప్పలు తప్పాయన్నారు.డాక్టర్ కావాలన్న విద్యార్థుల కలలను సాకారం చేసే మహాయజ్ఞం అని స్పష్టం చేశారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు” అనే దశాబ్దాల దుస్థితి నుంచి… “చలో పోదాం పదరో సర్కారు దవాఖానకు” అనే ధీమానిచ్చిన ధీరోదాత్తమైన నాయకత్వం తెలంగాణ సొంతం అని ఎమ్మెల్యే తెలిపారు. ఈకార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల డిసిఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, నిజామాబాద్ ఆర్టీవో రవి, డిప్యూటీ డిఎంహెచ్ఒ తుకరం రాథోడ్, డాక్టర్ సంతోష్ కుమార్, సైయ్యద్ నజిరోద్దిన్, శంకర్, నియోజకవర్గ వైద్య ఆరోగ్యశాఖ డాక్టర్లు, వివిధ మండలాలకు చెందిన జడ్పిటిసిలు ఎంపీపీలు, వైస్ ఎంపీపీ లు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, మహిళలు పాల్గొన్నారు.

 

Spread the love