నవతెలంగాణ -డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలో శుక్రవారం తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరుతూ గ్రామ పంచాయతీ కార్మికుల జెఎసి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జెఎసి నాయకులు మాట్లాడుతూ.. న్యాయమైన కోర్కేలను ప్రభుత్వం పరిష్కారం చూపకుండా దాట వేత ధోరణిని అవలంబిస్తున్న దాని పేర్కొన్నారు. తమ ప్రాణాలకు సైతం లేక్క చేయకుండా ప్రజలకు సేవ చేసిన ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు.ఇఖనైన న్యాయమైన డిమాండ్ లను పరిష్కారించడానికి ప్రభుత్వం కృషి చేయాలని వారన్నారు. కార్యక్రమంలో బి మురళి, రవి, పోశేట్టి తోపాటు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.