మహిళా సంక్షేమానికి పెద్దపీట..

– నామ మాత్రపు జీతాల ఆశా వర్కర్లు, అంగన్వాడి లు నాడు…!
– గ్రామీణ వైద్య రంగానికి ప్రాణ దీపికలు నేడు..!
– బిజెపి నాయకులు, మతం, గడ్డం పెట్టుకుని రాముని అడ్డం పెట్టుకొని, రాజకీయం చేయడం తప్ప ప్రజలకు చేసింది శూన్యం..
– ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్.
నవతెలంగాణ – డిచ్ పల్లి
మహిళా సంక్షేమానికి బిఅర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్దపీట వేస్తున్నారని గృహలక్ష్మి పథకంలో భాగంగా మహిళల పేరు పైనే డబుల్ బెడ్ రూం కేటాయిస్తామని ప్రకటించారని, ఇది కెసిఆర్ కు మహిళలపై ఉన్న ప్రేమ ఆప్యాయతకు నిదర్శనమని, నమ మాత్రపు జీతాలతో ఆశా కార్యకర్తలు, అంగన్వాడి లు నాడు ఉండేవారని,నేడు గ్రామీణ వైద్య రంగానికి ప్రాణ దీపికలుగా నేడు అని ఉన్న సమయంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్న తరుణంలో ఆశ కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లో ఆనాడు చేసిన సేవలు ఎన్నటికీ మర్చిపోలేనివని నేడు కూడా గర్భిణి స్త్రీల నుండి మొదలుకొని ఇప్పుడు పుట్టే చిన్నారుల వరకు వారి ముందు ఉండి అన్ని కార్యక్రమాలను చేపట్టడం హర్షించదగ్గ విషయమని వారికి వారు చేస్తున్న సేవలకు గాను కెసిఆర్ వేతనాలు పెంచే ఆలోచన చేసే అవకాశం ఉందని,
కానీ బిజెపి పాలించే రాష్ట్రాల్లో ఇవేమీ అమలు అవుతా లేవని, కానీ ఇక్కడ ఉన్న బిజెపి నాయకులు, మతం, గడ్డం పెట్టుకుని రాముని అడ్డం పెట్టుకొని, రాజకీయం చేయడం తప్ప ప్రజలకు చేసింది శూన్యమని ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కెఎన్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళ సంక్షేమ దినోత్సవం ,మహిళ ఉద్యోగులకు సన్మానం కార్యక్రమంలో యువ నాయకుడు జడ్పీ పిసి బాజిరెడ్డి జగన్ మోహన్, సిడిపిఓ స్వర్ణతల, నిజామాబాద్ ఆర్డిఓ రవి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, ఐకెపి కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొని మాట్లాడుతూ చాలీ చాలని జీతాలతో నిత్య పోరాటాల అంగన్వాడీలు నాడు ఉండేవారని, బోసినవ్వుల చంటి పిల్లల ఆలనా పాలనా నేడు చేస్తున్నారని,యువత ఉపాధి అవకాశాలు మృగ్యం అనాడు ఉంటే నేడు ప్రభుత్వ ఉద్యోగాల వరుస నోటిఫికేషన్ల జోరు ఉందన్నారు.9 ఏండ్లలో దేశంలోనే ఎక్కడాలేని విధంగా పథకాల అమలు ల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఒంటరి మహిళలకు పింఛన్లు, కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్‌, ఆరోగ్య మహిళ తదితర పథకాలు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆశ వర్కర్లకు రెండు నిమిషాలు మౌనం పాటించారు, అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.గతంలో ఆడబిడ్డ పుట్టిందంటే అమ్మో ఆడబిడ్డ అని ఆందోళన చెందేవారని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆడబిడ్డల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే నన్నారు. త్వరలో ‘గృహలక్ష్మి’ పేరిట ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం,మహిళల రక్షణకు షీ టీమ్స్‌, భరోసా కేంద్రాల ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం,గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో విలేజ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కార్యక్రమంతో వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, గ్రామసంఘం నిధుల ద్వారా రుణాలను ఇస్తూ జీవనోపాధిని కల్పిస్తున్నదని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వివరించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లలో పేదింటి ఆడబిడ్డల వివాహాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.320 కోట్ల ఆర్థికసాయం అందజేసిందని, 29,162 మందికి కల్యాణలక్ష్మి పథకం కింద రూ.276కోట్లు, షాదీముబారక్‌ కింద 5,655 మంది లబ్ధిదారులకు రూ.52.16 కోట్ల ఆర్థికసాయం అందించిందని దీంతో లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు.ఒంటరి మహిళలకు ఆసరా పింఛను సౌకర్యం కల్పించి సీఎం కేసీఆర్‌ మాకు బతుకు మీద భరోసా కల్పించారని, గత ప్రభుత్వాల్లో పెన్షన్‌ పేరుతో కేవలం 200 రూపాయలు అందించే వారని, అవి పప్పు, ఉప్పు లకు కూడా సరిపోయేవి కావన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ పెన్షన్‌ను రూ.1000 చేశారు. అనంతరం వృద్ధులు, వితంతువుల కష్టాలను అర్థం చేసుకున్న కేసీఆర్‌ 2018లో పెన్షన్‌ రూ.100 నుంచి రూ.2016 అందించడం చాలా గొప్ప విషయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా టీచర్లకు రూ.4500, ఆయాలకు రూ.2 వేల వేతనం అందించేవారని,మూడు, నాలుగు నెలలకోసారి నెల జీతం అందించే రోజులుండేవి. కానీ, నేడు ప్రతి నెలా వేతనాలు అందుకుంటూ హాయిగా గడుపుతున్నారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఏర్పాటైన ఏడేండ్లలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు మూడుసార్లు జీతాలు పెంచి చిత్తశుద్ధిని చాటుకున్నదని తెలిపారు. మొదటిసారి అంగన్‌వాడీ టీచర్లకు రూ.4,500 నుంచి రూ.7,500, ఆయాలకు రూ.2 వేల నుంచి రూ.4,500లకు పెంచింది. రెండో సారి టీచర్లకు రూ.7,500 నుంచి రూ.10,500, ఆయాలకు రూ.4,500 నుంచి రూ.6 వేలకు పెంచింది. తాజాగా పీఆర్సీ వర్తింపజేయడంతో టీచర్లకు రూ.13,650, ఆయాలకు రూ.7,800 వేతనాలు అందుతున్నాయి అని తెలిపారు. కరోనా కష్టకాలంలో గ్రామాల్లో ప్రజల ఆరోగ్యాల సేవల కోసం వారి ప్రాణాలు పణంగా పెట్టి ఇంటింటి తిరుగుతూ ఆరోగ్య సేవలు అందించారని, వీరి సేవలు ఎప్పటికీ మరువలేనివని మహిళా సోదరీ సోదరీమణులకు మాతృమూర్తులకు మహిళ సంక్షేమ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘ సభ్యులు ధర్పల్లి జెడ్పిటిసి జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు శ్రీ బాజిరెడ్డి జగన్మోహన్ గారు, ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్ , ఆర్డీవో రవి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, జడ్పిటిసిలు దాసరి ఇందిరా లక్ష్మీ నర్సయ్య, వైస్ ఎంపీపీలు, వివిధ మండల గ్రామాలకు చెందిన ఆశ వర్కర్లు, ఏఎన్ఎం వర్కర్లు, అంగన్వాడి టీచర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love