యూనివర్సిటీ లో కేసీఆర్ ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం..

నవతెలంగాణ -డిచ్ పల్లి
ఎస్అర్ఎస్ పి పునర్జీవ పథకం ద్వారా బాల్కొండ నియోజకవర్గానికి కాలేశ్వర నీళ్లు తీసుకువచ్చి బాల్కొండను బంగారు కొండ గా సస్యశ్యామలం చేస్తున్న, ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి లా విద్యార్థి యువత రైతుల పక్షాన కృతజ్ఞత అభివందనాలు తెలిపారు. గురువారం యూనివర్సిటీ లో చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేముల సురేందర్ రెడ్డి రైతు నాయకుడిగా బాల్కొండ నియోజకవర్గ రైతుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారని కోనియడారు. ఒక రైతు బిడ్డగా రైతుల కష్టాలు తెలిసిన మంత్రి తండ్రి బాటలోనే పయనిస్తూ కాలేశ్వరం నీళ్లను బాల్కొండకు తీసుకురావడం అనేది గొప్ప విషయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఒప్పించి పునర్జీవన పథకాన్ని తీసుకువచ్చి ఎస్సారెస్పీ ప్రాజెక్టులో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేశ్వరం నీళ్లను ముప్కల్ పంపు వరకు తీసుకొచ్చిన ఘనత ప్రశాంత్ రెడ్డి కి దక్కుతుందని వారు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో యెండల  సువర్చల, ఎ. హరిత నరేందర్, రమేష్, వరలక్ష్మి, రచన, పోశెట్టి, ప్రసాద్, రాఘవేంద్ర, ప్రసాద్ సందీప్, యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love