ఎవరి ప్రయోజనాలకోసం ఈ దశబ్ది ఉత్సవాలు..

– ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య..
నవతెలంగాణ- డిచ్ పల్లి
బీఅర్ఎస్ 9 ఏండ్ల పరిపాలనలో ఎవరి ప్రయోజనం నెరవేర్చారని ఈ దశబ్ది ఉత్సవాలు జరుపుకుంటు న్నరని ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య ప్రభుత్వన్ని ప్రశ్నించరు. మంగళవారం డిచ్ పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ బిఅర్ఎస్ పార్టీ అధికారం లోకి వస్తే దళితున్నీ ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కెసిఆర్ ఆయన్నే ముఖ్యమంత్రి అయ్యారని, దళితులకు 3 ఎకరాల భూమి పంపిణి చేస్తానని చెప్పి,దళిత సమాజన్ని మోసం చేశారని, రైతులకు లక్ష లోపు రుణమాఫీ హామీ మరిచి రైతులను మోసం చేశారని, ఇంటికో ఉద్యోగం, ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ భృతి హామీ గాలికొదిలరని అయన దుయ్య బట్టారు. పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చడానికి డబుల్ బెడురూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తామని చెప్పిన మాట ఏమైందని అన్నారు. అధికారం లోకి రాగానే వంద రోజుల్లోనే మూత పడిన చెక్కెర ఫ్యాక్టరీలు తెరిపించి నడిపిస్తానని చేపిన మాటకు 9 ఏండ్లు పూర్తి అయినా నేటి వరకు ఆ హామీ నెరవేరాలేదని, పైగా చెరుకు రైతు బతుకులో చేదును మిగిల్చి, కార్మికులను రోడ్డున పడేసిన చరిత్ర కెసిఆర్ కే దక్కిందన్నారు. తెలంగాణలోనే సహకార రంగంలో కొనసాగిన ఏకైక చక్కెర ఫ్యాక్టరీ సారంగాపూర్ ను ఎన్ సి ఎస్ ఎఫ్ ను తెరిపించి నడిపించాలని లేదా 95 యాక్టులో రైతులకే అప్పాజెప్పాలని అయన డిమాండ్ చేశారు. మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మర్చి బంగారు తెలంగాణగా అంటూ కెసిఆర్ కళ్ళబోలి మాటలతో కాలం గడుపుతున్నాడని పేర్కొన్నారు. ప్రజా ధనాన్ని దశబ్ది ఉత్సవాల పేరిట విచ్చల విడిగ ఖర్చు చేస్తూ ప్రజలను అయోమయనికి గురి చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా బిఅర్ఎస్ ప్రభుత్వ చర్యలను ఎండ గట్టాలని ప్రజలను అయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఎఐకెఎంఎస్ ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయరెడ్డి, సహాయ కార్యదర్శి దేవస్వామి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love