అంగన్వాడీ టీచర్లకు ఆశా వర్కర్లకు టిఏడిఏల చెల్లించాలి

– సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ ప్రభుత్వానికి డిమాండ్
నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా మహిళా దినోత్సవం నిర్వహిస్తూ ఈ కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్స్ , ఆశా కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం టీఏడీఏలు చెల్లించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వము దశబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ అంగన్వాడీ టీచర్స్ , ఆశ కార్యకర్తల, సమస్యలు పరిష్కరించడంలో వివక్ష చూపుతోందని ఆయన అన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని. పిఎఫ్. ఈఎస్ఐ సౌకర్యంతో పాటు. పెండింగ్ బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

Spread the love