నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి చెందాలంటే యువకులే ముఖ్యమంటారు అదే తరహాలో మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం యువతరం సర్పంచ్ సురేష్ ఉప సర్పంచ్ విట్టల్ కలిసి గ్రామ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తూ నాలుగు సార్లు ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డులు పొందారు శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ సురేష్ ఉప సర్పంచ్ విట్టల్ కలిసి మెలిసి ఒకేసారి ఇద్దరూ చిత్రపటాలకు పూజలు నిర్వహించడం గ్రామ అభివృద్ధికి ఆ ఇద్దరు యువకులు కృషి ప్రతి సంవత్సరం ఉత్తమ అవార్డులు సాధించడం వారిద్దరి పనితనం అన్న తమ్ముళ్ల లాగే గ్రామపంచాయతీ అభివృద్ధిని ముందుకు తీసుకు వెళుతున్నారు.