– తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ &హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సురేష్ గొండ పిలుపు.
నవతెలంగాణ – మద్నూర్
ఐ సి డి ఎస్ కు బడ్జెట్ ను పెంచి,ఐ సి డి ఎస్ కు ప్రమాదకరమైన 2020నూతన జాతీయ విద్య విధానం చట్టాన్ని రద్దు చెయ్యాలని,45వ ఐ ఎల్ ఎస్ సిపారసులు అమలు చెయ్యాలని అంగన్వాడీ టీచర్లందరికి కనీస వేతనం 26వేలు చెల్లిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతు ఈ నేల 19న బాన్స్ వాడ లో అంగన్వాడీ ఉద్యోగుల జిపు జత కార్యక్రమం లో భాగంగా సాయంత్రం 4గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టే బహిరంగ సభలో మద్నూర్, బాన్స్ వాడ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లందరు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చెయ్యాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ &హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సురేష్ గొండ కోరారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చెయ్యకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి 9సంవత్సరాలు దాటినా ఏ ఒక్క ఖాళీ పోస్ట్ ను భర్తీ చెయ్యలేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాలని ఎండగట్టేందుకు పరిష్కారం కోసం ప్రతి ఒక్కరు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు జరిగే దేశవ్యాప్త పోరాటం లోభాగస్వాములు కావాలని ఆయన పిలుపు నీచ్చారు. ఈ సందర్బంగా 19న చేపట్టే కార్యక్రమం పై సోమవారం బాన్స్ వాడ లో జిపు జత పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం మద్నూర్, బాన్స్ వాడ ప్రాజెక్ట్ సిడిపిఓలకు జిపు జతకు అనుమతి కోరుతూ.. ప్రాజెక్ట్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులతో కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమం లో ప్రాజెక్ట్ అధ్యక్షురాలు మహాదేవి, కార్యదర్శి రాధ, సావిత, వాజ్రా విజయలక్ష్మి, బాలమణి, సిఐటియు జిల్లా నాయకులు జె. రవీందర్ తదితరులు పాల్గొన్నారు.