అమెరికాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు భార‌తీయ మృతి

నవతెలంగాణ – న్యూఢిల్లీ: అమెరికాలో జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో గుజ‌రాత్‌కు చెందిన ముగ్గురు మ‌హిళ‌లు మృతిచెందారు. ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ ప‌టేల్‌, సంగీతబెన్ ప‌టేల్‌, మ‌నీషాబెన్ ప‌టేల్ ఆ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయారు. ద‌క్షిణ క‌రోలినాలోని గ్రీన్‌విల్లే కౌంటీలో ఆ ముగ్గురు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం అదుపు త‌ప్పి ప్ర‌మాదానికి లోనైంది. ఎస్‌యూవీ వాహ‌నం అన్ని లేన్ల‌ను దాటుకుంటూ.. 20 ఫీట్ల ఎత్తులో గాలిలోకి వెళ్లింద‌ని, ఆ త‌ర్వాత స‌మీపంలో ఉన్న చెట్ల‌ను ఢీకొన్న‌ట్లు గ్రీన్‌విల్లే కౌంటీ పోలీసులు వెల్ల‌డించారు. వాళ్లు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం అతి వేగంగా వెళ్తున్న‌ట్లు చీఫ్ డిప్యూటీ క‌రోన‌ర్ మైక్ ఎల్లిస్ తెలిపారు. కారును ఓ చెట్టుపై గుర్తించామ‌ని, అది ముక్క‌లు ముక్క‌లైంద‌ని పోలీసులు తెలిపారు. ప్ర‌మాదంలో ఒక‌రు మాత్ర‌మే గాయాల‌తో బ‌య‌ట‌ప‌డి ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. వాహ‌నంలో ఉన్న డిటెక్ష‌న్ సిస్ట‌మ్ వ‌ల్ల ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతాన్ని కుటుంబ స‌భ్యులు గుర్తించారు.

Spread the love