నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సోమవారం రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ కె రవికాంత్, జిల్లా సెక్టోరియల్ అధికారి సీఎంవో శ్రీనివాస రావు లు ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న మన ఊరు – మనబడి పనులను పరిశీలించి పనులు జరుగుతున్న తీరును పాట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు సరఫరా చేసిన దుస్తువులలో ఏదైనా లోపాలు ఉంటే వాటిని తిరిగి ఇవ్వాలని తెలిపినట్లు ప్రధానోపాధ్యాయులు సంతోష్ కుమార్ తెలిపారు. ఇదే కాకుండా విద్యార్థుల సంఖ్య, పాఠ్య పుస్తకాలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ను అన్ని హంగులతో సరికొత్త గా చేయడం పాట్లా సంతృప్తి వ్యక్తం చేశారు.