నవతెలంగాణ – ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలం లోని పలు మత్తామాల పాటశాల లో ఎంపీపీ మాధవి బలరాజ్ గౌడ్ చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏక రూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాధవి బలరాజ్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్నా సౌకర్యాలను విద్యార్థులు ఉపయోగించుకోవలని ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్య ఉంటుంది అని అన్నారు. అదేవిధంగా ఎల్లారెడ్డి మండలం లోని కొట్టాల్ ఎంపిపిఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య పాఠ్యపుస్తకాలు,ఎక రూప దుస్తులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.