నవతెలంగాణ – ఎల్లారెడ్డి: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ రన్ కార్యక్రమాన్ని ఎల్లారెడ్డి శాసనభ్యుడు జాజుల సురేందర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. మండల కేంద్రంలోని అంబెడ్కర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే జాజుల సురేందర్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ రన్ లో పాల్గొన్నారు. అంబెడ్కర్ చౌరస్తా నుండి ఎల్లారెడ్డి బస్టాండ్, గాంధీచౌక్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాజల సురేందర్ మాట్లాడుతూ నిత్యా వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని యువుకులు ఎప్పుడు వ్యాయమం చేయడం వల్ల పోలీస్ వంటి కోలోవుల్లో తొందరగా జాబ్ లు వస్తాయని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం వచ్చాకా యువకులకు వేల సంఖ్యలో ఉద్యోగాలు వచ్యయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీను నాయక్,మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ,ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు,మున్సిపల్ కమిషనర్ జగ్జివన్,జడ్పీటీసీ ఉష గౌడ్, సి ఐ శ్రీనివాస్, ఎస్ ఐ గణేష్ , వివిధ మండలాల సర్పంచులు,ఎంపీటీసీలు, వివిధ మండలాల పోలీస్ అధికారులు,వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.