వసతులు,సిబ్బంది కరువు

– వైద్యం కావాలంటే పట్టణాలకు వెళ్లాల్సిందే..
– వ్యాక్సిన్‌ కావాలంటే పాత మండలానికి వెళ్లాల్సిందే
– ప్రజలకు అందుబాటులో లేని వైద్య సేవలు
– పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
ప్రభుత్వాలు ఎన్ని మారినా సాధారణ ప్రజలు మారుమూల ప్రాంతాల ప్రజలకు వైద్యం కోసం ఇబ్బందులు తప్పడం లేదు. మండల కేంద్రాల్లో ఆస్పత్రులు ఉన్న వైద్య సదుపాయాలు, సరైన సిబ్బంది లేక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు వైద్య సిబ్బంది సైతం సమయపాలన పాటించకపోవడంతో ఆస్పత్రులకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న ఆస్పత్రుల్లో వైద్యానికి సరిపడే పరికరాలు లేకపోవడంతో చిన్న చిన్న జబ్బులకే జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సి పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి ఆస్పత్రుల్లో సిబ్బంది, పరికరాలు, మందులు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.

నవతెలంగాణ-కోట్‌పల్లి
కోట్‌పల్లిలో మండలం ఏర్పాటు కాకముందు పెద్దేముల్‌ మండలం కింద ఉన్నప్పుడు 2014 లో అప్పటి రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి రూ.70 లక్షల నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు చేయడంతో అన్ని గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వివిధ పనులు నిమిత్తం వస్తు పోతూ ఉంటారు. మండల కేంద్రం అయినప్పటికీ ఆస్పత్రిలో వసతులు సరిగా లేకపోవడం, సిబ్బంది కొరత ఉండడంతో ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న జబ్బులు వచ్చిన సరైన మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంతో వైద్యం కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాఇ్స వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్‌ స్టోరేజ్‌ పాయింట్‌ లేక వివిధ గ్రామాలలో వారం వారం వ్యాక్సిన్‌ చేయడానికి మందులు లేకపోవడంతో పాత మండలాలకు వెళ్లి తెచ్చుకోవాల్సి పరిస్థితి ఏర్పడుతుందని ఆశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే వ్యాక్సిన్‌, ఐ ఎల్‌ ఆర్‌, సదుపాయం కల్పిస్తే మండల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని కోరుతున్నారు. దీంతో ఆస్పత్రిలో నీటి కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఆస్పత్రికి వచ్చిన రోగులు, ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి వైద్య సిబ్బంది, మందులు, నీటి సమస్యను పరిష్కరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

సిబ్బంది కొరతతో ఇబ్బందులు
ప్రభుత్వాస్పత్రిలో చాలా సమస్యలు ఉన్నాయి. సూపర ్‌వైజర్లు లేరు. ల్యాబ్‌ టెక్నిషియన్‌ లేరు. ఇద్దరు స్టాఫ్‌ నర్సులు ఉం డాల్సి ఉంటే ఒక్కరే ఉన్నారు. సిబ్బంది లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మండ లంలో మూడు ఉప కేంద్రాలు ఉండగా ఆ ఉప కేంద్రాలు సజావుగా సాగుతున్నాయా లేవా అని సందర్శించేందుకు గతంలో ఒక వాహనం ఉండేది. ఇలాంటి సదుపాయాలు చాలా అవసరం ఉన్నాయి.
– అబ్దుల్‌ ఖయ్యూం సీహెచ్‌ఓ

వైద్యం కోసం పట్టణానికి వెళ్లాల్సిన పరిస్థితి
ప్రభుత్వాస్పత్రి ఉన్న వైద్య సిబ్బంది కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఉన్న సిబ్బంది సైతం సమయపాలన పాటించడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేకపోవడంతో వైద్యం కోసం 25 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి ఆస్పత్రికి సరైన వసతులు కల్పించాలి. సిబ్బందిని నియమించాలి.
– నక్కల బందయ్య.. నాయకులు

Spread the love