జతకట్టి జనంలోకి…

నవతెలంగాణ – రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
– జోడెడ్లుగా గడ్డం ప్రసాద్‌, రంజిత్‌రెడ్డి
– అంతర్గత సమస్యలకు స్వస్తి
– రంజిత్‌ రెడ్డి గెలుపు కోసం ఐక్యమైన కాంగ్రెస్‌ నేతలు
– రంజిత్‌రెడ్డి గెలుపును భుజానేసుకున్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌
– కార్యకర్తలు, నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న రంజిత్‌రెడ్డి
– వికారాబాద్‌ జిల్లాలో తిరుగులేని శక్తిగా కాంగ్రెస్‌
– చేవెళ్లలో వర్‌ వన్‌సైడే అంటున్న క్యాడర్‌
అసెంబ్లీ ఎన్నికల్లో వారు ప్రత్యర్థులు. ఒకరిని ఓడించేందుకు ఒకరు ప్రణాళికలు రచించారు. కాలం గడించింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఓ నేత పార్టీ మారారు. చేరిన పార్టీ నుంచే చేవెళ్ల పార్లమెంట్‌ అభ్యర్థి అయ్యారు. దాంతో పాత ప్రత్యర్థులు ఇప్పుడు మిత్రులు అయ్యారు. పార్టీ అభ్యర్థి గెలుపును మరో నేత తన భుజాలపై వేసుకున్నారు. ఆ ఇద్దరే స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి. వాళ్లిద్దరూ ఒక్కటై జనంలోకి వెళ్త్తున్నారు. దాంతో చేవెళ్లలో కాంగ్రెస్‌ విజయం వన్‌సైడే
అని క్యాడర్‌లో జోష్‌ పెరిగింది.
ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్టు చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి తనదైన సమన్వయం, తనకే సాధ్యమైన శైలితో ముందుకెళుతున్నారు. పార్టీలో అంతర్గత సమస్యలు, అలకలను గురి ్తస్తూ, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో ఆయన గెలుపు కోసం హస్తం నేతలు, కార్యకర్తలు అహర్నిశలూ కృషి చేస్తున్నారు. రంజిత్‌ రెడ్డి విజయమే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతలు ముందు కు కదులుతున్నారు. తాజాగా వికారాబాద్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో నిర్వహించిన అంతర్గత సమావేశాల్లో నేతలు గుస్సా అయ్యారు. అధిష్టానం నిర్ణయాన్ని స్వాగతిస్తూనే… గతంలో తమకు ఎదురైన కొన్ని అనుభవాలను వారు ప్రస్తావించారు. వాటన్నింటికీ గల కారణాలను సహేతుకంగా వివరిస్తున్న రంజిత్‌… అలాంటి అంశాలు మున్ముం దు పునరావృతం కాకుండా చూస్తామం టూ భరోసానిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల వరకు రంజిత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో క్రియాశీలక నేతగా, ఎంపీగా ఉన్నారు. అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ గ్రాఫ్‌ ప్రజల్లో భారీగా పడిపోవటంతో క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్‌ బలం రోజురోజుకూ పెరిగిపోతూ ఉండటంతో ఆయన కారు పార్టీకి గుడ్‌ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమంలో ఎప్పటి నుంచో హస్తం పార్టీ కోసం పని చేస్తున్న కొందరు నాయకులు, వారి కార్యకర్తలు కొంత నొచ్చుకున్నారు. అయితే వారి మనోభావాలను పరిగణ నలోకి తీసుకున్న రంజిత్‌ రెడ్డి ఓపిగ్గా ప్రతీ విషయాన్ని చర్చిస్తూ, వారి అభిమానాన్ని చూరగొంటున్నారు. తాను కాంగ్రెస్‌లోకి కొత్తగా వచ్చినా, అందరి వాడిననే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
గతంలో బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు కూడా ఎంపీగా ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ కలు పుకుని పోయారు. ప్రజల సమస్యలను పరిష్కరించిన తీ రును వివరిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే సీఎం రేవం త్‌రెడ్డి చేవెళ్ల లోక్‌సభపై సమీక్ష నిర్వహించి, నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఎలాంటి శషబిషాలు, మనస్పర్థలు లేకుం డా అందరూ కలిసి కట్టుగా పని చేయాలనీ, తద్వారా రం జిత్‌ రెడ్డిని గెలిపించాలంటూ ఆయన ఆదేశించిన సంగతి తెలిసిందే. చేవెళ్లలో కాంగ్రెస్‌ జెండా ఎగిరితే, ఆ తర్వాత అందరి సమస్యలూ పరిష్కారమవుతాయంటూ సీఎం భరోసానిచ్చారు. మరోవైపు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ నియోజకవర్గమైన వికారాబాద్‌ కూడా చేవెళ్ల లోక్‌సభ పరి ధిలోనే ఉంది. దాంతో ఇప్పుడు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు మార్‌, ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి ఒకటి అయ్యారు. రంజిత్‌రెడ్డి గెలుపును స్పీకర్‌ తన భుజాలపై వేసుకున్నారు. తన నియోజకవర్గంతోపాటు ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లలోని ప్రతి నాయకుడు, క్రియాశీలక నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ రంజిత్‌రెడ్డి గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని సూచిస్తున్నారు.
మరోవైపు సీఎం రేవంత్‌ నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో సైతం చేవెళ్లకు సంబంధించిన అనేక ఆంశాలను ప్రస్తవిస్తూ రావడం రంజిత్‌కు అదనపు బలాన్ని చేకూర్చుతోంది. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్టానం ఎంపీ అభ్యర్థులను నిర్ణయించిందని ఆయన స్పష్టం చేశారు. ఆ క్రమంలో చేవెళ్లకు రంజిత్‌రెడ్డిని అభ్యర్థిగా నియమించామంటూ సీఎం క్యాడర్‌కు చెప్పారు. అన్ని రకాలుగా ఆలోచించే చేవెళ్లలో రంజిత్‌ను బరిలోకి దింపామని సీఎం చెప్పిన మా ట… నేతలు, కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపుతోంది. దాంతో నియోజకవర్గ పరిధిలోని స్పీకర్‌, కాంగ్రెస్‌ ఎమ్మె ల్యేలు, పార్టీ నేతలు, క్యాడర్‌ అందరూ కలిసి రంజిత్‌రెడ్డి విజయం కోసం కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి జోడెడ్లలాగా ప్రజల్లోకి వెళ్తూ విజయం సాధించేందుకు అహర్నిశలూ కృషి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూస్తుంటే చేవెళ్లలో రంజిత్‌రెడ్డి విజయం ‘నల్లేరూ మీద నడక’నే అని క్యాడర్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.

Spread the love