విద్యుత్ షాక్ తగిలి చిన్నారి మృతి

నవతెలంగాణ-భిక్కనూర్
విద్యుత్ షాప్ తగిలి చిన్నారి మరణించిన సంఘటన మండలంలోని అంతంపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రమ్య మూడు సంవత్సరాల క్రితం బిక్కనూరు పట్టణానికి చెందిన ప్రవీణ్ తో వివాహం జరిగింది. వీరికి 16 నెలల బాబు శ్రీతిక్ ఉన్నాడు. రమ్య ఆరోగ్యం బాగా లేనందున తన తల్లి గారి ఇల్లు అయినా అంతం పల్లి గ్రామంలో ఉంటుంది. సోమవారం సాయంత్రం ఇంటి ముందు ఉన్న దండంపై బట్టలు ఆరవేస్తుండగా రమ్యకు తన కుమారుడు శ్రీతిక్ కు విద్యుత్ విద్యుత్ షాక్ తగిలింది. దీనిని గమనించిన ఇంటి పక్కన వ్యక్తి కర్రతో విద్యుత్ వైర్ నుండి దూరం చేయగా కుమారుడుకి విద్యుత్ షాక్ తీవ్రంగా తగిలింది. అపస్మారక స్థితిలో ఉన్న కుమారుడిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి బాబు అప్పటికే మరణించాడని తెలపడంతో గ్రామంలో విషాదఛాయలుముకున్నాయి. ఈ మేరకు పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్ తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆనంద్ గౌడ్ తెలిపారు.
Spread the love