రైతుబంధు పేద ప్రజలకా? భూస్వాములకా?: జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి

నవతెలంగాణ- రామారెడ్డి
రైతుబంధు పేద ప్రజల కా? భూస్వాములకా? అని ప్లే కార్డులతో జిల్లా పరిషత్ ఆవరణలో శుక్రవారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ లో వ్యవసాయ స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించగా, ఈ సందర్భంగా మోహన్ రెడ్డి పేద, మధ్యతరగతి వ్యవసాయదారులకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ప్లే కార్లతో నిరసన తెలిపి, ఆయన మాట్లాడుతూ…. 10 సంవత్సరాలు నిండకముందే, ప్రభుత్వం ఆగ మేఘాల మీద ప్రజాధనాన్ని వృధా చేసి, దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడంలో అంతర్యం ఏంటని, రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేదని, రైతుబంధు పేద, మధ్యతరగతి కుటుంబాలకు వర్తించేలా చర్యలు తీసుకోవాలని, పోడు భూములకు వెంటనే పట్టాలు అందించాలని, ధరణి పోర్టల్ రద్దుచేసి, అన్యకాంతమైన రైతుల భూములను రైతులకు ఆన్లైన్లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వడ్లూరు ఎల్లారెడ్డి దక్కన్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రైతుబంధు డబ్బులను, లోను క్రింద జమ చేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపినట్లు, మోహన్ రెడ్డి తెలిపారు.

Spread the love