బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి

నవతెలంగాణ – కంటేశ్వర్
బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నో వెంటనే అరెస్టు చేయాలని కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) భారత ప్రజాతంత్ర యువజన సంఘం కమిటీల ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ చేతులు కట్టేసుకొని ,నల్ల బాడ్జ్ తో మౌన నిరసన కార్యక్రమం చేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి మహేష్ , డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పిట్ల నరేష్ మాట్లాడుతూ.. నిన్న నూతన పార్లమెంట్ భవన ప్రారంభం సందర్భంగా భారత మల్ల యోధులు భారత జెండాను పట్టుకొని శాంతియుత నిరసన తేలియచేస్తుండంగా పోలీసులు వారిని అమానుషంగా కొట్టుతూ ,కనీసం త్రివర్ణ పతాకాన్ని కూడా గౌరవించకుండా కింద పడేయడం సిగ్గు చేటు అని అన్నారు.అదే విధంగా మహిళ మల్ల యోధుల పట్ల బిజెపి ఎంపీ రెజ్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులు చేస్తున్నాడని అసోసియేషన్ కి పోలీసులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదు, అని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర గత 5 నెలల నుండి పోరాటానికి ఇతర సామాజిక సంఘాలు, మేధావులు మద్దతు తెలియచేస్తూ పోరాటన్ని ఉదృతం చేస్తే తూతుమంత్రంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసారే తప్ప అరెస్టు చెయ్యలేదు లాగే నిందితుడు బీజేపీ ఎంపీ అయిన ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించపోవడం బాధాకరం అని అన్నారు. అలాగే దేశ ప్రధాని ఒక సినిమా గురుంచి మాట్లాడుతారు కానీ దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాలలో చాటిచెప్పే ఒలింపిక్స్ మెడల్స్ సాధించిన క్రీడాకారుల సమస్య గురుంచి కనీసం స్పందించకపోవడం చూస్తుంటే దేశం పట్ల దేశభక్తి కంటే అధికారం కోసం ఓట్ల భక్తియే ఎక్కువ అయిన్నట్టు తెలిస్తుంది అని అన్నారు.ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం స్పందించి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ని అరెస్టు చేసి ,కఠినంగా శిక్షించాలని లేని యెడల దేశవ్యాప్తంగా అని రంగాల క్రీడాకారులను ఏకం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు దీపికా ,సందీప్ డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆశీర్వాదం, ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు శైలజ, దుర్గశ్రీ, సాయికిరణ్ ,ఆజాద్ ,సాయినాథ్,మారుతి తదితరులు పాల్గొన్నారు.

Spread the love