జాబ్ మేళాను సద్వినియోగం పరుచుకోండి ప్రజా ప్రతినిధులు

– మద్నూర్ ,పెద్ద ఎక్లారా, లో పోస్టర్ల ఆవిష్కరణ
నవతెలంగాణ – మద్నూర్
ఈనెల 25న బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే మేఘ జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం పంచుకోవాలని మద్నూర్ మండల ప్రజా ప్రతినిధులు కోరారు జాబ్ మేళ పోస్టర్లను శనివారం నాడు మద్నూర్ మండల కేంద్రంలో అలాగే పెద్ద ఎక్లారా గ్రామాల్లో ఆవిష్కరించారు ఈ సందర్భంగా మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు సురేష్ మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకుల కోసం వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ పరంగా మేఘ జాబ్ మేళాను నిర్వహించే అవకాశాలను నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాల కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలని కోరారు ఈ పోస్టర్లు ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బనిసిపటేల్ తదితరులు పాల్గొన్నారు

 

Spread the love