బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌ బాహుబలి చరిత్రలో కొత్త అధ్యాయం

Baahubali: Crown of Blood A new chapter in the history of Baahubali‘బాహుబలి ఫ్రాంచైజీకి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’తో బాహుబలి చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించడం అద్భుతంగా అనిపిస్తుంది’ అని దర్శకుడు రాజమౌళి అన్నారు. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో రాబోయే బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌ యానిమేటెడ్‌ సిరీస్‌ యూనివర్స్‌ని హైదరాబాద్‌లోని ఏఎంబి సినిమాస్‌లో గ్రాండ్‌గా ఆవిష్కరించారు. గ్రాఫిక్‌ ఇండియా, ఆర్కా మీడియావర్క్స్‌ ప్రొడక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, విజనరీ ఫిల్మ్‌ మేకర్‌ రాజమౌళి, శరద్‌ దేవరాజన్‌, శోభు యార్లగడ్డ దీనిని నిర్మించారు. జీవన్‌ జె. కాంగ్‌, నవీన్‌ జాన్‌ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ ఈనెల 17న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ”బాహుబలి’ కోసం క్యారెక్టర్‌ ఆర్క్స్‌, ప్రీ స్టొరీ, పోస్ట్‌ స్టొరీ రాసినప్పుడు బాహుబలి యూనివర్స్‌లో ప్రేక్షకులకు చెప్పడానికి ఇంకా కథ ఉందనిపించింది. వెస్ట్రన్‌ కంట్రీస్‌లో ఒక సినిమా విజయవంతమైతే ఆ బ్రాండ్‌ అనేక మీడియమ్స్‌లో ముందుకు వెళ్తుంది. ఇక్కడ మాత్రం అలా జరగడం లేదు. సినిమా విజయవంతమైతే అక్కడితో అయిపోతుంది. అయితే మేము ఈ విజయాన్ని కొనసాగించాలని వీర్‌ ఫిలిమ్స్‌, సిరీస్‌ ఇలా చాలా విధాలుగా ప్రయత్నించాం. ఇలాంటి సమయంలో శరత్‌ వచ్చారు. యానిమేషన్‌లో ఆయన విజన్‌ నాకు చాలా నచ్చింది. అలా వారితో అసోసియేట్‌ అయ్యాం. ఆయనతో చాలా కథా చర్చలు జరిగాయి. బాహుబలి ప్రతి పాత్రలో సోల్‌, ఎమోషన్‌ ఉంటుంది. ఆ ఎమోషన్‌ ప్రేక్షకులను గొప్పగా హత్తుకుంటుంది. ఈ యానిమేషన్‌ సిరీస్‌ని
శరత్‌ కూడా ఆ సోల్‌ పట్టుకొని అద్భుతంగా రూపొందించడం ఆనందంగా వుంది. గ్రాఫిక్‌ ఇండియా, ఆర్కా మీడియావర్క్స్‌, డిస్నీం హాట్‌స్టార్‌లతో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం’ అని ఎస్‌.ఎస్‌.రాజమౌళి చెప్పారు.

Spread the love