ఆద్యంతం సరికొత్త థ్రిల్‌ ఇచ్చే శబరి

ఆద్యంతం సరికొత్త థ్రిల్‌ ఇచ్చే శబరివరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘శబరి’ మే 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్‌ పతాకంపై మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మించారు. అనిల్‌ కాట్జ్‌ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానున్న సందర్భంగా వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ మీడియాతోహొముచ్చటించారు. ‘క్రాక్‌’కు సంతకం చేయడానికి ముందు ‘శబరి’ కథ విన్నా. నాకు బాగా నచ్చింది. కథపై నమ్మకంతో ఈ సినిమా చేస్తానని చెప్పాను. టిపికల్‌ రెగ్యులర్‌ నెగిటివ్‌ షేడ్‌ రోల్‌ కాకుండా కొత్త పాత్ర చేశా. ఆర్టిస్టుగా నేను ఈ పాత్ర చేయగలనని దర్శక, నిర్మాతలు నమ్మారు. ఫిమేల్‌ ఓరియెంటెడ్‌ సినిమా చేయడానికి వాళ్లు ముందుకు వచ్చారు. అందుకు వాళ్లను మెచ్చుకోవాలి. ఖర్చు విషయంలో నిర్మాత రాజీ పడకుండా సినిమా తీశారు. ఇదొక సైకలాజికల్‌ థ్రిల్లర్‌. అందరికీ నచ్చుతుంది.హొ
హిట్టూ ఫ్లాపులనుహొఎవరూహొజడ్జ్‌ చేయలేరు. ‘హను మాన్‌’ చిన్న సినిమా అనుకున్నారు. పెద్ద హిట్‌ అయ్యింది. ‘నాంది’, ‘కోట బొమ్మాళీ పీఎస్‌’ సినిమాలు అంత మంచి విజయాలు సాధిస్తాయని ఊహించలేదు. మేం ఒక డిఫరెంట్‌ సినిమా చేశాం. స్క్రీన్‌ ప్లే డ్రివెన్‌ సినిమా ‘శబరి’. ప్రేక్షకులకు కొత్త థ్రిల్‌ ఇస్తుంది. డిఫరెంట్‌ యాక్షన్‌ ఉంటుంది. నేచురల్‌ ఫైట్‌ సీక్వెన్సులుహొఉంటాయి.హొనా తొలి సినిమా ‘పొడా పొడి’లో మదర్‌ రోల్‌ చేశా. ‘పందెం కోడి 2’లో చేశా. నేను ఓ యాక్టర్‌. నచ్చిన క్యారెక్టర్‌ వచ్చినప్పుడు చేస్తాను. ఇమేజ్‌ వంటివి పట్టించుకోను. సినిమాలో ప్రేక్షకులకు ఏం చూపిస్తే అది యాక్సెప్ట్‌ చేస్తారు. ఇందులో ఓ సాధారణ అమ్మాయి. భర్తతో సమస్యల కారణంగా, అతని నుంచి వేరుపడి కుమార్తెను ఒంటరిగా పెంచుతుంది. ఆమెకు ఏమైంది? అనేది కథ. సెటిల్డ్‌ పెర్ఫార్మన్స్‌ చేసే అవకాశం లభించింది. కుమార్తెను కాపాడుకునేటప్పుడుహొతల్లికి వచ్చే కోపం వేరు, సాధారణంగా వచ్చే కోపం వేరు. డిఫరెంట్‌ యాంగర్‌ చూపించేహొఅవకాశం వచ్చింది. మదర్‌ అండ్‌ డాటర్‌ కనెక్షన్‌ మూవీలో హైలైట్‌ అవుతుంది. కూతుర్ని కాపాడుకోవడం కోసం తల్లి ఏం చేసిందనేది కథ.హొ ‘కూర్మ నాయకి’ సినిమా విడుదలకు సిద్ధమైంది. తమిళంలో ధనుష్‌ గారి సినిమాతో పాటు మరో సినిమా చేస్తున్నా. కన్నడలో సుదీప్‌ గారి ‘మ్యాక్స్‌’ చేశా. మరో రెండు మూడు సినిమాలు చర్చలహొదశలో ఉన్నాయి.

Spread the love