పాలిక్‌ శ్రీను దర్శకత్వంలో నయా సినిమా షురూ..

New movie directed by Palik Srinu..”ఐ.ఐ.టి.కష్ణమూర్తి’ ఫేమ్‌ పథ్వీ హీరోగా, రూపాలి, అంబిక హీరోయిన్లుగా రచిత్‌ శివ, ఆర్‌.ఆర్‌.క్రియేషన్స్‌ అండ్‌ పాలిక్‌ స్టుడియోస్‌ పతాకాలపై తెరకెక్కుతున్న ప్రొడక్షన్‌ నెం.3 చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని దుర్గం రాజేష్‌, రావుల రమేష్‌, టి.ఎస్‌.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం పాలిక్‌ శ్రీను. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హీరో, హీరోయిన్లపై క్లాప్‌ కొట్టి టీమ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా సీనియర్‌ నటి ఆమని మాట్లాడుతూ,’ఈ చిత్రంలో నేను ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నా. లవ్‌ అండ్‌ సెంటిమెంట్‌ ఎమోషనల్‌ కామెడీ మూవీ. ఇది గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న చిత్రం’ అని తెలిపారు. ‘ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున్న నిర్మించడానికి రావుల రమేష్‌, టి.ఎస్‌.రాజులతో కలిసి ముందుకు వచ్చాం. హీరో పథ్వీని తెలంగాణ నుంచి, హీరోయిన్లను బాలీవుడ్‌ నుంచి, మళయాలం నుంచి అనిరుధ్‌ని విలన్‌గా… ఇలా అన్ని ప్రాంతాల నుంచి ఆర్టిస్టులను తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’ అని నిర్మాత దుర్గం రాజేష్‌ చెప్పారు. నిర్మాత రావుల రమేష్‌ మాట్లాడుతూ,’ ఇటీవలే కాలకేయ ప్రభాకర్‌తో కలిసి ‘రౌద్రరూపాయ నమ:’ చిత్రాన్ని విడుదల చేశాం. ఆ చిత్రానికి మంచి పేరు వచ్చింది. ఈ చిత్రానికి ఎక్కువ థియేటర్లు లభిస్తాయని ఆశిస్తున్నా’ అని అన్నారు. ‘నా మిత్రుడు ఎస్‌.ఆర్‌.పి. కథతో ఈ సినిమా చేస్తున్నాం. పాటలు బాగా వచ్చాయి. వచ్చే నెల 25 నుంచి సెట్స్‌ మీదకు వెళుతుంది. ఐదు షెడ్యూల్స్‌లో సినిమాని పూర్తి చేసి దీపావళికి సినిమాని విడుదల చేస్తున్నాం’ అని దర్శకుడు పాలిక్‌ చెప్పారు.

Spread the love