ప్రతి మహిళ చూడాల్సిన సినిమా

Devil-lovingసాయి సిద్ధార్ద్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై ప్రొడక్షన్‌ నెం.1గా తెరకెక్కిన సినిమా ‘మెర్సి కిల్లింగ్‌’. సాయికుమార్‌, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సిద్ధార్ద్‌ హరియల, మాధవి తాలబత్తుల నిర్మించారు. సూరపల్లి వెంకటరమణ దర్శకుడు. వేదుల బాల కామేశ్వరి సమర్పిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఘనంగా జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సాయికుమార్‌ మాట్లాడుతూ,’ప్రతి మహిళ చూడవలసిన సినిమా. ఆడవారిపై జరుగుతున్న అకత్యాలు ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. స్వేచ్ఛ అనే అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. మరోసారి మరో మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను’ అని అన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం చిత్రమిది. స్వేచ్ఛ అనే అనాథ బాలిక తనకు న్యాయం జరగాలంటూ చేసే పోరాటం అందరికీ కనెక్ట్‌ అవుతుందని దర్శకుడు వెంకటరమణ ఎస్‌ తెలిపారు.

Spread the love