తన కుమార్తె అర్హ చేసే డ్యాన్స్ వీడియోలను హీరో అల్లు అర్జున్ సోషల్‌మీడియాలో పోస్టు చేస్తుంటారు. అవి ట్రెండింగ్ అవుతుంటాయి. ఇటీవల వచ్చిన ‘యానిమల్’ సినిమాలోని ‘జమల్‌కుడు’ పాటలో మందు గ్లాసు తలపై పెట్టుకుని బాబీదేవోల్ స్టెప్పులు వేశారు. ఇప్పుడు అదే పాటకు అర్హ కూడా స్టెప్పులేసింది. తలపై ప్లేటు పెట్టుకుని నడుచుకుంటూ వస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ‘శాకుంతలం’లో ఆమె వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే.