దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మాస్ ఎంటర్‌టైనర్ ‘కింగ్ ఆఫ్ కోత’. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 24న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. రానా దగ్గుబాటి, నాని ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ, ‘ఇది మా అందరి డ్రీమ్ ప్రాజెక్ట్. నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇది. నేను బలంగా నమ్మి చేసిన గ్యాంగ్ స్టార్ డ్రామా. మీరంతా ఈ చిత్రాన్ని మెచ్చుకొని పెద్ద హిట్ కాదు బ్లాక్‌బస్టర్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ‘ఈ ట్రైలర్ చూసినప్పుడు చాలా ఎగ్జైట్‌మెంట్ కలిగింది. దుల్కర్ ఒక యాక్షన్ సినిమా చేయడమే దీనికి కారణం’ అని రానా దగ్గుబాటి అన్నారు. నాని మాట్లాడుతూ, ‘దుల్కర్ కెరీర్ తెలుగులో నెక్స్ట్ లెవల్‌కి వెళుతున్న ఈ తరుణంలో నేను ఈ వేడుకలో ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. ట్రైలర్, విజువల్స్, మ్యూజిక్.. చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాయి. ‘సీతారామం’తో దుల్కర్ మనందరి మనసులు గెలుచుకున్నాడు. ఈ సినిమాతో అది నెక్స్ట్ లెవల్‌కి వెళ్లాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ‘దుల్కర్, నాని, రానా లాంటి ఇండియన్ సినిమా గేమ్ చేంజర్స్‌తో కలసి ఈ వేదిక పంచుకోవడం అనందంగా ఉంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’ అని నాయిక ఐశ్వర్య లక్ష్మీ అన్నారు.