సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌ పిజ్జా 3

Seat Edge Thriller Pizza 3మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ హర్రర్‌ థ్రిల్లర్‌ ఫ్రాంచైజీ ‘పిజ్జా’. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని, భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ‘పిజ్జా3’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే తమిళంలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. అశ్విన్‌ కాకుమణి, పవిత్ర మరిముత్తు ప్రధాన పాత్రలలో మోహన్‌ గోవింద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రైట్స్‌ని సొంతం చేసుకున్న కనెక్ట్‌ మూవీస్‌ ఎల్‌ఎల్పీ ఈనెల18న తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేస్తోంది.
ఈ సందర్భంగా హీరో అశ్విన్‌ కాకుమణి మాట్లాడుతూ, ‘పిజ్జా3′ స్క్రిప్ట్‌ చాలా డిఫరెంట్‌. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి థియేటర్లో చూడండి. తప్పకుండా ఎంజారు చేస్తారు’ అని అన్నారు. ‘ఇది నా మొదటి తెలుగు రిలీజ్‌. చాలా ఆనందంగా ఉంది’ అని నాయిక పవిత్ర చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ, ‘ఇది నాకు చాలా స్పెషల్‌ మూవీ. ఇది ప్యూర్‌ హర్రర్‌ మూవీ. బలమైన కంటెంట్‌తోపాటు ఎమోషన్‌ ఉంటుంది’ అని తెలిపారు.
ఆశిష్‌ వేమిశెట్టి మాట్లాడుతూ, ‘సినిమా చాలా గ్రిపింగ్‌గా ఉంటుంది. థ్రిల్లింగ్‌ మూమెంట్స్‌, బీజీఎం, కెమెరా వర్క్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ అద్భుతంగా ఉంటాయి. ఇంటర్వెల్‌ బాంగ్‌ ఎక్స్‌ట్రార్డీనరిగా ఉంటుంది. గొప్ప థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుంది. తమిళంలో కంటే తెలుగులో మరింత విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాను. డిస్ట్రిబ్యుషన్‌ ప్రొడ్యుసర్‌గా ఇది నా మొదటి సినిమా’ అని చెప్పారు.

Spread the love