– హీరో నాగశౌర్య
హీరో నాగశౌర్య, పవన్ బాసంశెట్టి కాంబినేషన్‌లో రూపొందిన ‘రంగబలి’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎస్ ఎల్ వి సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించిది బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ,”రంగబలి’ చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కతజ్ఞతలు. పవన్ చాలా మంచి సినిమా తీశారు. చాలా మంచి కథ చెప్పారు. ప్రేక్షకులు బాగా ఎంజారు చేస్తున్నారు. ‘ఛలో’ తర్వాత నాకు రంగబలి మరో బ్లాక్‌బస్టర్. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన నిర్మాత సుధాకర్‌కి, టీమ్‌కి కతజ్ఞతలు. యుక్తి చక్కగా నటించింది. సత్య, జాకెట్ (రాజ్ కుమార్) ఇద్దరూ చక్కగా ఎంటర్‌టైన్ చేశారు. ఈ విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి కతజ్ఞతలు’ అని తెలిపారు. ‘మా చిత్రాన్ని ప్రేక్షకులు అన్ని చోట్ల ఎంతగానో ఎంజారు చేస్తున్నారు. సినిమా చూస్తున్నంత సేపు పడిపడి నవ్వుతున్నారు. ఫస్ట్ హాఫ్‌ని చాలా ఎంజారు చేస్తున్నారు. శౌర్య, సత్య, రాజ్ కుమార్ పాత్రలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. సెకండ్ హాఫ్‌లో ఒక మంచి కథ, సందేశాన్ని చెప్పాం. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఎంజారు చేస్తున్నారు. కలెక్షన్స్ బాగున్నాయి. ఈ విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కతజ్ఞతలు’ అని దర్శకుడు పవన్ బాసంశెట్టి చెప్పారు. నాయిక యుక్తి తరేజ మాట్లాడుతూ,’ఇది నా మొదటి తెలుగు సినిమా. సినిమాని ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. సినిమాని ప్రేక్షకులు ఎంజారు చేయడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.