యూనిక్‌ హర్రర్‌ సినిమా

మహేష్‌ భట్‌ సమర్పణతోపాటు ఆయన స్వీయ రచనలో రూపొందిన హర్రర్‌ చిత్రం ‘1920: హర్రర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌’. అవికా గోర్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి కష్ణ భట్‌ దర్శకత్వం వహించారు. విక్రమ్‌ భట్‌ ప్రొడక్షన్‌ పై రాకేష్‌ జునేజా, శ్వేతాంబరీ భట్‌ డా.రాజ్‌కిషోర్‌ ఖవ్రే నిర్మించారు. ఈనెల 23న ఈ చిత్రం తెలుగులో విడుదల కానున్న నేపథ్యంలో నాయిక అవికా గోర్‌ మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
‘మహేష్‌ భట్‌, విక్రమ్‌ భట్‌ లాంటి లెజెండరీ ఫిల్మ్‌ మేకర్స్‌తో పని చేయడం అనేది నా కల. ఇదొక యూనిక్‌ హర్రర్‌ సినిమా ఇది. నాకు హర్రర్‌ సినిమాలు చూడటం ఇష్టమే. భయ పడుతూ చూస్తాను (నవ్వుతూ). ‘రాజుగారి గది 3’ హర్రర్‌ కామెడీ. కానీ ఈ సినిమా మాత్రం సీరియస్‌ హర్రర్‌ ఫిల్మ్‌. ఇలాంటి హర్రర్‌ సినిమా చేయడం నాకు ఇదే తొలిసారి. ఈ సినిమా కథ, కాన్సెప్ట్‌ కొత్తగా ఉంటాయి. ఇందులో కేవలం హర్రర్‌ కాకుండా ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్‌ కూడా ఉంది. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజారు చేస్తారు. హీరో నాగార్జున నా మొదటి సినిమా నుంచి ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల ఆయన నన్ను పాన్‌ వరల్డ్‌ స్టార్‌ అని అన్నారు. ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రస్తుతం ‘ఇందు’ అనే వెబ్‌ సిరీస్‌, అలాగే ఆది సాయికుమార్‌తో ‘అమరన్‌’ చేస్తున్నాను’ అని అవికాగోర్‌ చెప్పారు.

Spread the love