అందమైన ప్రేమకథ

విజరు దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. లవ్‌స్టోరీ, ఎమోషనల్‌ స్టోరీలను తీయడంలో దర్శకుడు శివ నిర్వాణ మార్క్‌ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మరోసారి ఆయన తన మ్యాజిక్‌ చూపించేందుకు రెడీగా ఉన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్‌ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రం నుంచి ‘ఆరాధ్య..’ అనే సాంగ్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్టుగా ప్రకటిస్తూ మేకర్లు ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో సమంత, విజరులు ఎంతో కూల్‌గా కనిపిస్తున్నారు. ఈ పాట ప్రోమోను సోమవారం, పాటను బుధవారం విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే ‘నా రోజా నువ్వే’ అనే పాట యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారింది. వంద మిలియన్లకు చేరువలో ఉంది. ఇప్పుడు ఈ సెకండ్‌ సింగిల్‌ ‘ఆరాధ్య’తో మరోసారి ‘ఖుషి’ సినిమా ట్రెండ్‌ అవ్వడం ఖాయం. చార్ట్‌ బస్టర్‌ లిస్ట్‌లో ‘ఆరాధ్య’ పాట కూడా చేరనుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు. సెప్టెంబర్‌ 1న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది.

Spread the love