సుధీర్ బాబు హీరోగా ‘లూజర్’ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సిఏఎం ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫాదర్స్ డే సందర్భంగా మేకర్స్ సినిమా టైటిల్‌ను విడుదల చేశారు. ‘మా నాన్న సూపర్ హీరో’ అనే టైటిల్‌ని ఖాయం చేశారు.
తండ్రి, కొడుకుల ప్రేమ, అనుబంధాల నిజమైన అర్థాన్ని తెలియజేసి, సోల్‌ని కదిలించే అద్భుతమైన ప్రయాణంగా ఈ చిత్రం ఉండబోతుంది. ఆర్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి చంద్, షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, హర్షిత్ రెడ్డి సపోర్టింగ్ రోల్స్ పోషిస్తున్నారు.
ఈ మాన్సూన్‌లోనే విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి డివోపీ : సమీర్ కళ్యాణి, సంగీతం: జై క్రిష్, ఎడిటర్: అనిల్ కుమార్ పి, కొరియోగ్రఫీ: రాజు సుందరం, రచయితలు: ఎంవిఎస్ భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర.