సరికొత్త కాన్సెప్ట్‌తో మిషన్‌ తషాఫి

వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తూ ప్రేక్షకుల హదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న ఓటీటీ మాధ్యమం జీ 5. ఇప్పుడు సరికొత్త యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌ ‘మిషన్‌ తషాఫి’ ఒరిజినల్‌తో ఆకట్టుకోవటానికి సిద్ధమవుతోంది. దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు ఈ వెబ్‌ సిరీస్‌ను డైరెక్ట్‌ చేస్తున్నారు. సిమ్రాన్‌ చౌదరి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, అనీష్‌ కురువిల్లా, ఛత్రపతి శేఖర్‌, భూషణ్‌ కళ్యాణ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రధాన తారాగణంగా నటించబోయే నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్‌ తెలిపారు. హై ఇంటెన్స్‌ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘మిషన్‌ తషాఫి’ ఒరిజినల్‌ రెగ్యులర్‌ షూటింగ్‌ శనివారం నుంచి ప్రారంభమైంది. 8 ఎపిసోడ్స్‌ ఉన్న ఈ వెబ్‌ సిరీస్‌ను ఫిల్మ్‌ రిపబ్లిక్‌ బ్యానర్‌పై ప్రణతి రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు ఓటీటీ చరిత్రలో ఇప్పటి వరకు రూపొందని విధంగా ఈ హై ఇన్‌టెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌ సిరీస్‌ను జీ 5 భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది. ప్రముఖ అంతర్జాతీయ యాక్షన్‌ కొరియోగ్రాఫర్స్‌ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు చిత్రీకరించని సరికొత్త లొకేషన్స్‌లో ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు. ఈ వెబ్‌ సిరీస్‌కు నిర్మాత: ప్రణతి రెడ్డి, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: ప్రవీణ్‌ సత్తారు, సినిమాటోగ్రఫీ: నరేష్‌ రామదురై, ఆర్ట్‌: సాయి సురేష్‌, ఎడిటర్‌:ధర్మేంద్ర కాకరాల.

Spread the love