అందర్నీ మెప్పించే భారీ తారాగణం

సదన్‌, దీపికా రెడ్డి, రేఖ నిరోషి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘భారీ తారగణం’. శేఖర్‌ ముత్యాల దర్శకత్వంలో బివిఆర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై బి.వి రెడ్డి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ‘నేను రాసిన కథను నమ్మి నిర్మాత అవకాశం ఇచ్చారు. సినిమా మీద ఉన్న నమ్మకంతో విడుదలకు నెల రోజుల ముందే డిస్ట్రిబ్యూటర్లు, సన్నిహితులకు షో వేసి చూపించాం. మంచి స్పందన వచ్చింది. కథ బావుండటంతో పీవీఆర్‌ ఉదరు సినిమాను విడుదల చేయడానికి ముందు కొచ్చారు. సినిమా ప్రారంభం నుంచి అలీ ఇచ్చిన సపోర్ట్‌ మరచిపోలేను. ఈ నెల 23న వస్తున్న ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నా’ అని అన్నారు.
‘ఆస్ట్రేలియాలో బిజినెస్‌లో ఉన్న నాకు దర్శకుడు శేఖర్‌ పరిచయమయ్యారు. ఆయన చెప్పిన కథ నాకు కనెక్ట్‌ అయింది. లవ్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. అన్ని వర్గాలను ఆకట్టుకునే చిత్రమిది. కథ, కథనంతోపాటు సంగీతం, అలీ, 7ఆర్ట్స్‌ సరయు చేసిన ప్రత్యేక గీతం సినిమాకు హైలైట్‌ అవుతాయి. మా చిత్రాన్ని విడుదల చేస్తున్న పీవీఆర్‌ సంస్థకు కతజ్ఞతలు’ అని నిర్మాత బి.వి.రెడ్డి చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఎం.వి గోపి.

Spread the love