ఓ మంచి దెయ్యం

‘ఓ మంచి ఘోస్ట్‌’ (ఓఎమ్‌జీ) శంకర్‌ మార్తాండ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వైవిధ్యమైన హారర్‌ కామెడీ చిత్రం. మార్క్‌ సెట్‌ నెట్‌ వర్క్స్‌ బ్యానర్‌ పై డా. అభినిక ఐనాభాతుని నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తు న్నారు. వెన్నెల కిషోర్‌, షకలక శంకర్‌, నందితా శ్వేత, నవమి గాయక్‌తో పాటు రజిత్‌, నవీన్‌ నేని, రఘు తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి రెండవ సాంగ్‌ ‘పాప నువ్వు తోపు..’ పాటను మీడియా సమక్షంలో రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా విడుదల చేసారు.
ఈ పాటను యువ రచయిత సింహాచలం రాయగా, ‘అలవైకుంటపురంలో’ సిత్తరాల సిరపడు పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలసురన్న పాడారు. అలాగే శకలక శంకర్‌ కూడా పాటలో కొంత భాగం పాడారు.
నిర్మాత డా.అభినిక తండ్రి రాధాకష్ణ మాట్లాడుతూ,’మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనూప్‌ రూబెన్స్‌ స్వరపరచిన ప్రతీ పాట అద్భుతంగా ఉంది’ అని అన్నారు.
డైరెక్టర్‌ మార్తాండ్‌ శంకర్‌ మాట్లాడుతూ, ‘హర్రర్‌ కథలకు నేపథ్య సంగీతం గుండె లాంటిది. అనూప్‌ రూబెన్స్‌ ప్రాణం పెట్టి మ్యూజిక్‌ ఇచ్చారు. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది’ అని తెలిపారు. ”పైసా రే పైసా’ మాదిరిగా ‘ఓ పాప నువ్వు తోపు’ కూడా వైరల్‌ సాంగ్‌ అవుతుంది’ అని అనూప్‌ రూబెన్స్‌ అన్నారు.

Spread the love