రవితేజ, గోపీచంద్ కాంబినేషన్ ఇప్పటికే హ్యాట్రిక్ హిట్‌ని పూర్తి చేశారు. తాజాగా ఈ బ్లాక్‌బస్టర్ కాంబో నాలుగోసారి చేతులు కలిపింది. ఈ ప్రాజెక్ట్‌ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఆదివారం ఈ సినిమాని అధికారికంగా అనౌన్స్ చేశారు.
గోపీచంద్ మలినేని గత బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘క్రాక్, వీరసింహారెడ్డి’ మాదిరిగానే వాస్తవ సంఘటనల ఆధారంగా యూనిక్ అండ్ పవర్ ఫుల్ కథని రాశారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో భయానక స్థితిలో ఉన్న ఓ గ్రామం, కాలిపోతున్న ఇల్లు, డేంజర్ బోర్డు కనిపిస్తున్నాయి. టెర్రిఫిక్‌గా ఉన్న ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచిందని అని చిత్ర బృందం తెలిపింది.
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో, అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మించనున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మిగిలిన వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.