శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఓ సినిమాని నిర్మిస్తున్నారు. విరాట్ కర్ణను హీరోగా పరిచయం చేస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ శుక్రవారం ప్రకటించారు.
ఈ సినిమా కోసం పవర్ ఫుల్, మాస్-అప్పీలింగ్ టైటిల్ ‘పెద కాపు-1’ని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల లాక్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విరాట్ కర్ణని ఇంటెన్స్, రగ్గడ్‌గా ప్రెజెంట్ చేశారు. భారీ జనసమూహంలో విజయానికి సంకేతంగా అభివాదం చేస్తూ కనిపించారు కర్ణ. ‘ఓ సామాన్యుడి సంతకం’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. సరికొత్త కాన్సెప్ట్‌తో భిన్న కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా అందరినీ కచ్చితంగా మెప్పిస్తుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. ఈ చిత్రానికి సంగీతం – మిక్కీ జె మేయర్, డీవోపీ – చోటా కె నాయుడు, ఎడిటర్ – మార్తాండ్ కె వెంకటేష్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, కొరియోగ్రాఫర్ – రాజు సుందరం.