నామమాత్రంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

దశాబ్ధి ఉత్సవాల పట్ల ఆసక్తి చూపని ప్రజలు,అధికారులు కార్యాలయాల్లో, పార్టీల నాయకులు గద్దెల వద్ద జాతీయ జండాలను ఆవిష్కరణ
నవతెలంగాణ-మంగపేట
అట్టహాసంగా జరపాల్సిన తెలంగాణ దశాబ్ది, ఆవిర్బావ దినోత్సవాలకు మండల ప్రజలు ఆసక్తి చూపకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు, పార్టీల నాయకులు గ్రామాల్లోని ముఖ్య కూడళ్లలోని తమ పార్టీల గద్దెల వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను నామా మాత్రంగా నిర్వహించారు. తెలంగాణ సిద్దించి తొమ్మిది సంవత్సరాలు గడిచి పదో సంవత్సరంలోకి అడుగిడుతున్న తరుణంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దశాబ్ధి ఉత్సవాల పేరిట తెలంగాణ ఆవిర్బావ దినోత్సవాలను అట్టహాసంగా నిర్వహిం చాలని పిలుపునిచ్చింది. కార్యక్రమాల విజయవంతానికి రెవిన్యూ, పోలీస్‌, ఫారెస్టు, వ్యవసాయ, పంచాయతీరాజ్‌, విద్య, ఇరిగేషన్‌ వంటి ముఖ్య శాఖల అధికారుల ఆధ్వర్యం లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి ప్రజలను చైతన్య పర్చి 21 రోజుల పాటు జరిగే దశాబ్ధి ఉత్సవ కార్య క్రమాలను విజయవంతం చేయాలని నిర్ణయం తీసు కున్నారు. ఐనప్పటికీ జూన్‌ 2 తెలంగాణ ఆవిర్బావ ది నోత్సవ జండా కార్యక్రమానికి ప్రజలెవరూ హాజరు కాకపోవడంతో కేవలం ప్రభుత్వ కార్యాలయాల్లో అధికా రులు, గ్రామపంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు మాత్రమే ఆయా గ్రామాల్లోని ముఖ్య కూడళ్లలోని తమ పార్టీల గద్దెల వద్ద జాతీయ జం డాలను ఆవిష్కరించి మమ అనిపించారు. రెవిన్యూ కార్యాల యంలో తహసీల్దార్‌ వై.శ్రీనివాసులు, మండల పరిషత్‌ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి తుల రవి, పోలీస్‌ స్టేషన్‌ లో ఎస్సై తహర్‌ బాబా, ఫారెస్టు రేంజి కార్యాల యంలో రేజంర్‌ షకిల్‌ పాషా, రైతు సేవా సహాకార సంఘం కార్యాలయంలో చైర్మన్‌ తోట రమేష్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ గూల్ల వెంకటయ్య, వ్యవసాయ కార్యా లయంలో ఏఓ ఎన్‌.చేరాలు, విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈవో లకావత్‌ రాజేష్‌ కుమార్‌, ఐకెపీ కార్యాలయంలో ఏపీఓ అప్పారావు, విద్యుత్‌ శాఖ కార్యాలయంలో ఏఈఈ ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ వైద్యశాల లో వైద్యుడు నరేష్‌ లు జాతీయ జండాలను ఆవిష్కరించి ఉత్సవాలను నిర్వహిం చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love