మై డియర్‌.. మార్కండేయా

పవన్‌ కళ్యాణ్‌-సాయి ధరమ్‌ తేజ్‌ ద్వయం మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. ఈ సినిమా కోసం జీ స్టూడియోస్‌తో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ చేతులు కలిపింది. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ అందించిన ఈ సినిమా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం ఈ చిత్రం నుండి మొదటి సింగిల్‌ విడుదలైంది. తమన్‌ ఈ పాటకు అద్భుతమైన సంగీతం అందించారు. పవన్‌ కళ్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌పై తెరకెక్కించిన ‘మై డియర్‌ మార్కండేయ’ పాటను రేవంత్‌, స్నిగ్ధ శర్మ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు గణేష్‌ స్వామి, భాను నత్యరీతులు అందించారు.
ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా నిర్మించిన విలాసవంతమైన పబ్‌ సెట్‌లో ఈ పాటను చిత్రీకరించారు. సమయం, జీవితం గురించి లోతైన భావంతో నిండిన ఈ పాట, సందేశాన్ని ఇవ్వడంతో పాటు అందర్నీ కాలు కదిపేలా ఉంది. స్టైలిష్‌ అవతార్‌లో సాయి ధరమ్‌, తన చరిష్మాతో తెరకు నిండుతనం తీసుకొచ్చిన పవన్‌ కళ్యాణ్‌ రాకతో పాట మరింత ఊపందుకుంది.
‘మై డియర్‌ మార్కండేయా.. మంచి మాట చెప్తా రాసుకో..’ అనే పంక్తులు ఆయన వ్యక్తిత్వానికి, పాత్రకు సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి. అలాగే ఈ పాటలో ఊర్వశి రౌతేలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్నిగ్ధా శర్మ ఈ పాటకు జానపద ఆకతిని తీసుకువచ్చారు అని చిత్ర బృందం తెలిపింది.

Spread the love