డెవిల్‌ విశ్వరూపం

కళ్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటించిన మరో వైవిధ్యమైన చిత్రం ‘డెవిల్‌’. ‘బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. తాజాగా చిత్ర నిర్మాతలు కళ్యాణ్‌ రామ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు.
‘డెవిల్‌’ అనే క్రూరమైన, తెలివైన సీక్రెట్‌ ఏజెంట్‌ను ఈ గ్లింప్స్‌ ద్వారా ఆడియెన్స్‌కు పరిచయం చేశారు. ‘స్వాతంత్య్రానికి పూర్వం ‘డెవిల్‌’ అనే బ్రిటీష్‌ ఏజెంట్‌ ఉండేవాడు’ అని గ్లింప్స్‌లో రాగానే కళ్యాణ్‌ రామ్‌ కనిపిస్తూ మంచి ఏజెంట్‌ ఎలా ఉండాలనే డైలాగ్‌ను వినిపించారు. ఈ గ్లింప్స్‌లో బ్యూటీఫుల్‌ హీరోయిన్‌ సంయుక్తా మీననన్‌ కూడా కనిపించింది. డెవిల్‌ చేసే యాక్షన్‌, రొమాన్స్‌, రహస్యాన్ని ఛేదించటానికి తను వెళ్లే మార్గం మన అంచనాలను పెంచుతాయి అని చిత్ర బృందం తెలిపింది. అభిషేక్‌ పిక్చర్స్‌ దర్శకత్వ పర్యవేక్షణలో దేవాన్ష్‌ నామా సమర్పకుడిగా..అభిషేక్‌ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవీన్‌ మేడారం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో రిలీజ్‌ చేస్తున్నారు.

Spread the love