రంగబలి.. మంచి సినిమా

నాగశౌర్య, నూతన దర్శకుడు పవన్‌ బాసంశెట్టి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘రంగబలి’. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటించారు. ఈనెల 7న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హీరో నాగశౌర్య మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు..
రంగబలి ఎలాంటి సినిమా ?
– మన ఊర్లో మనం తోపు అని అందరికీ తెలుసు. సొంత ఊరు అనే ఫీలింగే వేరు. ఈ సినిమా చూస్తున్నపుడు మళ్ళీ మన రూట్స్‌ని టచ్‌ చేసి వచ్చిన ఫీలింగ్‌ కలుగుతుంది. మాస్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమా ఇది.
ఫస్ట్‌కాపీ తర్వాత సినిమాపై ఎలాంటి నమ్మకం కలిగింది?
– సినిమా చూసిన తర్వాత వచ్చిన నమ్మకంతోనే ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేశా. ప్రేక్షకులకు ఈ సినిమా గురించి ఇంత నమ్మకంగా చెప్పగలుగుతున్నా. ‘రంగబలి’ చాలా మంచి సినిమా.
నూతన దర్శకుడు పవన్‌తో వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?
– నటుడికి దర్శకుడు స్పేస్‌ ఇవ్వాలి. ఆ స్పేస్‌ పవన్‌ ఇచ్చాడు. ఇది చాలా మంచి సినిమా. ఏ విషయంలో కూడా ఒత్తిడి తీసుకొవద్దని, ఏ సాయం కావాలన్నా చేస్తానని పవన్‌కి ముందే చెప్పాను. తను చెప్పింది చెప్పినట్లుగాన తీశాడు. నాకు నా సినిమాల విషయంలో అనుభవం ఉంది. ఎక్కడ కరెక్ట్‌గా జరుగుతుందో చెప్పలేను కానీ ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థమైపోతుంది. అనుభవాన్ని, పవన్‌ విజన్‌ని జోడించి అనుకున్నట్లుగా చేయగలిగాం.
సినిమాలోని ప్రధాన ఆకర్షణలు ఏమిటి?
– పవన్‌ సి హెచ్‌ చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. పాటలు, ఆర్‌ఆర్‌ రెండూ అద్భుతంగా ఉంటాయి. థియేటర్‌లో చాలా ఎంజారు చేస్తారు. అలాగే నాయిక యుక్తి తరేజ చాలా మంచి యాక్టర్‌ అండ్‌ డ్యాన్సర్‌. ఇందులో చాలా చక్కగా నటించింది. తను టాలీవుడ్‌లో లీడింగ్‌ హీరోయిన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, ఆర్ట్‌ డైరెక్షన్‌ అలాగే మా నిర్మాత రాజీపడని తనం.. ఇవన్ని మా సినిమాకి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి.
నయా ప్రాజెక్ట్స్‌ గురించి?
– 24వ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యింది. ఇంకా టైటిల్‌ పెట్టలేదు. నేను వచ్చిందే ప్రేక్షకులని మెప్పించడానికి. అలాగే సినిమా అంటే పిచ్చి ప్యాషన్‌తో సినిమాలు నిర్మిస్తున్నాం తప్పితే డబ్బులు సంపాదించుకోవాలని కాదు. మాకు సినిమా అంటే పిచ్చి ఇష్టం. మాకు ఇది తప్పితే వేరేది తెలీదు.

Spread the love