దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో రాబోతున్న చిత్రం ‘అలా నిన్ను చేరి’. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, గ్లింప్స్, హీరో బర్త్ డే స్పెషల్ పోస్టర్ ఇలా అన్నింటికీ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందని మేకర్లు చెబుతున్నారు.
ఈ సినిమాకు సుభాష్ ఆనంద్ సంగీతం అందించగా, ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ అన్ని పాటలు రాయడం విశేషం. ఐ ఆండ్రూ కెమెరామెన్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా ఈ సినిమాకు పని చేశారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించనున్నారు.