సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలు గోదావరి డెల్టా నేపథ్యంలో పీరియడ్-గ్యాంగ్‌స్టర్-డ్రామాగా రూపొందుతున్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. యువ కథానాయకుడు విశ్వక్ సేన్ మునుపెన్నడూ చూడని గ్రే పాత్రలో కనిపించనున్నారు. క్రూరమైన, నేరపూరితమైన చీకటి సామ్రాజ్యంలో సామాన్యుడి నుంచి సంపన్నుడిగా ఎదగాలని కోరుకునే వ్యక్తి కథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ‘డీజే టిల్లు’ చిత్రంతో ‘రాధిక’గా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న నేహాశెట్టి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. నటి అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు.
యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన స్వర కల్పనలో హదయాన్ని హత్తుకునే మొదటి గీతం ‘సుట్టంలా సూసి’ బుధవారం మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగిన వేడుకలో విడుదలైంది. సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా మాట్లాడుతూ, ‘ఈ పాట మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. దర్శకులు కష్ణచైతన్య స్వతహాగా గీత రచయిత అయినప్పటికీ మరొకరికి అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. ఇంత మంచి సినిమాలో భాగంగా ఆనందంగా ఉంది’ అని అన్నారు.
కథానాయిక నేహా శెట్టి మాట్లాడుతూ, ”సితార బ్యానర్ నాకు ‘డీజే టిల్లు’ రూపంలో ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా మరో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని తెలిపారు.
‘యువన్‌కి నేను పెద్ద అభిమానిని. ఇది నాకు ఫ్యాన్ బారు మూమెంట్. ఆయనతో కలిసి పనిచేసే అవకాశమిచ్చిన మా నిర్మాతలకు కతజ్ఞతలు. యువన్ సంగీతం, అనురాగ్ కులకర్ణి గాత్రం, శ్రీ హర్ష సాహిత్యం తోడై ఈ పాట ఎంతో అందంగా వచ్చింది’ అని దర్శకుడు కష్ణ చైతన్య అన్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ఉప్పులూరి, గోపీచంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 8 న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
నేను యువన్ సంగీతానికి పెద్ద అభిమానిని. ఆయన స్వరపరిచిన ఎన్నో పాటలు ఏళ్ల తరబడి వింటూనే ఉంటాం. నాగ వంశీ నిర్మాణంలో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం.
ఈ పాట సాప్ట్‌గా ఉంటుంది. కానీ సినిమా మాత్రం మాస్‌గా ఉంటుంది. థియేటర్లలో ఒక్కొక్కరికి శివాలెత్తి పోతుంది.
– హీరో విశ్వక్ సేన్