సయ్యద్ సోహైల్ రియాన్, రూపా కొడవాయుర్ జంటగా మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల నిర్మించిన సినిమా ‘మిస్టర్ ప్రెగెంట్’. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకుడు. ఈ మూవీ ఈ నెల 18న విడుదలవుతోంది.
నైజాం ఏరియాలో ఈ సినిమాను ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తోంది. సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ వింజనం పాటి మీడియాతో ముచ్చటించారు.
మాది ఒంగోలు. సాఫ్ట్ ఇంజనీర్‌గా పనిచేస్తుండేవాడిని. కెనడాలో ఉన్నప్పుడు ఒక షార్ట్ ఫిలిం చేశాను. దానికి అవార్డ్ వచ్చింది. నా ఫ్రెండ్, నిర్మాత రవీందర్ రెడ్డికి కథ చెప్పాను. ఆయన ద్వారా మరో నిర్మాత అప్పిరెడ్డికి స్టోరీ వినిపించాం. ఆయనతోపాటు వాళ్ల ఫ్యామిలీ, అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీస్‌లోని కొంతమంది మహిళలకు కథ చెప్పించారు. వాళ్లందరూ ఈ కథ విని ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు ఈ సినిమా చేయమని వారంతా సజెస్ట్ చేశారు. అలా ఈ ప్రాజెక్ట్ ఒకే అయ్యింది.
సోహెల్ నాకు ఫ్రెండ్. ఈ కథ గురించి అతనికి తెలుసు. ప్రాజెక్ట్ సెట్ అయ్యేటప్పటికి తను బిగ్‌బాస్‌కు వెళ్లాడు. ఆ ప్రోగ్రామ్‌లో అతనికి మంచి పేరొచ్చి ఫేమస్ అయ్యాడు అతను చాలా బాగా నటించాడు. రూపా కొడవయూర్ తెలుగు అమ్మాయి కావడం వల్ల ఎమోషన్స్ చక్కగా పలికించింది. కళ్లతోనే ఎక్స్‌ప్రెషన్స్ చూపించింది. ఆమె డాక్టర్ కావడం కూడా ఈ క్యారెక్టర్‌కు బాగా ఉపయోగపడింది.
నా పర్సనల్ లైఫ్‌లోని ఈవెంట్స్ కొన్ని ఈ చిత్ర కథ రాసేందుకు స్ఫూర్తినిచ్చాయి. నా వైఫ్ ప్రీ మెచ్యూర్ బేబీకి జన్మ నిచ్చింది. ఆ బేబీని బాగా చూసు కునేందుకు ఆమె ఎంత కష్ట పడిందో ప్రత్యక్షంగా చూశాను. థామస్ అనే మేల్ ప్రెగెంట్ యూఎస్‌లో ఉన్నాడని పేపర్‌లో చదివాను. అప్పటి నుంచి ఈ తరహా కథ రాశాను.
ప్రెగెన్సీ టైమ్‌లో మహిళ కష్టాన్ని చూపిస్తే ఆర్ట్ ఫిలిం అవుతుంది. అలా కాకుండా ఈ సినిమాను కమర్షియల్ ఎలి మెంట్స్‌తో మంచి లవ్ స్టోరితో కలిపి చేశాం. అయితే మేల్ ప్రెగెంట్ అనగానే అందరూ వింతగా రియాక్ట్ అవుతారు. ప్రేక్షకులు కూడా అలాగే మొదట సర్‌ప్రైజ్ అవుతారు కానీ ఇందులోని ఎమోషన్స్‌కు కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాం. 100 మంది ప్రెగెంట్ వుమెన్‌కు స్పెషల్ షో వేస్తున్నాం.
ఈ సినిమాకు శ్రావణ్ భరద్వాజ్ మ్యూజిక్ అస్సెట్ అవుతుంది. అలాగే నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ మంచి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చాయి. ట్రైలర్ అందరికీ నచ్చింది. సినిమా మీద కూడా నమ్మకంతో ఉన్నాం. తెలుగు సినిమా ఇండిస్టీలో ఒక మంచి సినిమా చేశామనే పేరొస్తుంది. ఇప్పుడే కాదు పదేళ్ల తర్వాత మా సినిమా చూసినా ఇష్టపడతారు. క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ తర్వాత హీరో, హీరోయిన్ల క్యారెక్టర్‌లతో ప్రేక్షకులంతా ట్రావెల్ అవుతారు. ఇంటర్వెల్ బ్యాంగ్ కు గూస్ బంప్స్ వస్తాయి. క్లైమాక్స్ 45 మినిట్స్ సీట్స్ నుంచి కదలకుండా చూస్తారు. అమ్మాయి కోసం అబ్బాయి, అబ్బాయి కోసం అమ్మాయి చూడాల్సిన సినిమా ఇది. యూఎస్‌లో 100 ఫ్లస్ థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది.