ఉచిత బస్సు లొల్లి.. బస్సు ఆపలేదని ఆర్టీసీ డైవర్ పై మహిళ తీవ్ర ఆగ్రహం

నవతెలంగాణ – హైద‌రాబాద్ : రాష్ట్రంలో ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం ప‌థ‌కం ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి నిత్యం ఎక్క‌డో ఒక చోట ఘ‌ర్ష‌ణ‌లు జరుగుతూనే ఉన్నాయి. సీట్ల కోస‌మో, బ‌స్సును ఆప‌డం లేద‌నో గొడ‌వ‌లు అవుతున్నాయి. తాజాగా హైద‌రాబాద్ న‌గ‌రంలోని ల‌క్డీకాపూల్ బ‌స్టాండ్‌లో గొడ‌వ చోటు చేసుకుంది. లక్డికాపూల్‌లో బ‌స్టాండ్‌లో బ‌స్సు ఎక్కేందుకు సిద్ధ‌మైన ఓ మ‌హిళ‌ను ఆర్టీసీ డ్రైవ‌ర్ నిలువ‌రించాడు. బస్సు ఓవర్ లోడ్ అయిందని చెప్పి ఆమెను బస్సు ఎక్కించుకునేందుకు నిరాకరించాడు. త‌న‌ను ఎందుకు ఎక్కించుకోరు అంటూ ఆర్టీసీ డ్రైవ‌ర్‌పై బాధిత మ‌హిళ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తాను బ‌స్సు న‌డ‌ప‌లేను.. బండి తీసుకొని పో అంటూ ఆమె ప‌ట్ల డ్రైవ‌ర్ దురుసుగా ప్ర‌వ‌ర్తించాడు. బ‌స్సు ఎక్కించుకుంటావా..? లేదా..? అంటూ ఆమె బస్సుకు ఎదురుగా వెళ్లి నిల్చుంది. ఆ త‌ర్వాత ఆమెను ఎక్కించుకోవ‌డంతో బ‌స్సు ముందుకు క‌దిలింది. ఈ ఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో ఫ్రీ బస్సు ఎవరు పెట్టమన్నారంటూ మహిళలు మండిప‌డ్డారు. ఉచిత బస్ పెట్టి మా ప్రాణాల మీదకు తెస్తున్నార‌ని డ్రైవ‌ర్ కూడా అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు.
Spread the love