అందమైన ప్రేమకథ

జయ కుమార్‌, శీను, స్వీటీ, సిరి రావుల చారి, సునీత ప్రధాన పాత్రల్లో నటించిన అందమైన ప్రేమ కథ చిత్రం ‘మదిలో మది’. ఎస్‌.కే.ఎల్‌.ఎమ్‌ క్రియేషన్స్‌ పతాకంపై నేముకూరి జయకుమార్‌ నిర్మించిన ఈ చిత్రానికి ప్రకాష్‌ పల్ల దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఈనెల 18న రిలీజ్‌ కానుంది. నేపథ్యంలో చిత్ర బృందం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి తాగుబోతు రమేష్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’జై అసిస్టెంట్‌గా పని చేశాడు. నాకు డ్రైవర్‌గా ఉండేవాడు. అప్పటి నుంచి ఫైర్‌ ఉండేది. రామ్‌ లక్ష్మణ్‌ మాస్టర్‌, బేబి డైరెక్టర్‌ సాయి రాజేష్‌ చేతుల మీదుగా ప్రమోషన్‌ చేయించాడు. ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాడు. డైరెక్టర్‌ ప్రకాష్‌ ఈ సినిమాను బాగా తీశాడు. సినిమాలో ట్విస్టులు బాగుంటాయి. నిర్మాతకు విజయం చేకూరాలి’ అని అన్నారు. ‘సినిమా కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్‌లో అందరూ ఏడుస్తారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది’ అని హీరో జయకుమార్‌ చెప్పారు. దర్శకుడు ప్రకాష్‌ పల్ల మాట్లాడుతూ, ‘క్రాంతి నీలా ఇచ్చిన విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయి. డీఐ, సౌండింగ్‌ అన్నీ బాగా వచ్చాయి. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఓ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. మా టీమ్‌లో అందరూ కష్టపడి కాదు ఇష్టపడి సినిమాను చేశారు. సినిమాను తప్పకుండా చూసి సక్సెస్‌ చేస్తారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు.

Spread the love